Vijayasai Reddy : వైఎస్ జగన్‌కు చెందిన వైఎస్సార్ సీపీకి గుడ్‌బై చెప్పిన విజయసాయి రెడ్డి నెక్ట్స్ స్టెప్ ఏమిటి ? ఆయన తదుపరిగా ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతున్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితమే విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) హైదరాబాద్‌లోని షర్మిల నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న ఆమెతో దాదాపు 3 గంటలపాటు సమావేశమయ్యారు. మధ్యాహ్నం అక్కడే భోజనం కూడా చేశారు. ఈసందర్భంగా ఏపీకి సంబంధించిన పలు రాజకీయ అంశాలపై షర్మిల, విజయసాయి చర్చించుకున్నారని తెలిసింది.
Also Read :Balakrishna Interview : పురంధేశ్వరి, భువనేశ్వరికి బాలయ్య ఇంటర్వ్యూ
రాజకీయకోణం దాగి ఉందా ?
రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ఇటీవలే బహిరంగంగా ప్రకటించిన విజయసాయి రెడ్డి.. కొన్ని వారాలైనా గడవకముందే ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలతో భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. షర్మిల ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. ఒకప్పుడు ఏపీని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇప్పుడు షర్మిల చేతిలోనే ఉన్నాయి. అందుకే షర్మిలతో విజయసాయి భేటీలో తప్పకుండా రాజకీయకోణం దాగి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై షర్మిలతో ఆయన డిస్కస్ చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also Read :Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..
ఆ పదవి కోసమేనా ?
ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, విశాఖ, పలు ఉత్తరాంధ్ర జిల్లాల రాజకీయాలపై విజయసాయి రెడ్డికి మంచి పట్టు ఉంది. భవిష్యత్తులో ఆయా ప్రాంతాలను కాంగ్రెస్ పార్టీ తరఫున కోఆర్డినేట్ చేసేలా ఏదైనా కీలక పదవిని విజయసాయి ఆశిస్తున్నారనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు పెరుగుతాయి. వైఎస్సార్ సీపీలో ఉన్న చాలామంది విజయసాయి రెడ్డి సన్నిహితులు వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం ఉండదు. ఈ అంశాలన్నీ సవివరంగా చర్చించుకునేందుకే షర్మిల, విజయసాయి సమావేశం మూడు గంటల పాటు సాగి ఉంటుందని అంటున్నారు. విజయసాయి రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారా ? రాజకీయాలకు దూరంగా మౌనంగా ఉండిపోతారా ? అనేది ఇంకొన్ని వారాల్లో మనందరికీ తెలిసిపోతుంది.