Vijayasai Reddy Illegal Affair : వెంకటేశ్వర స్వామి సాక్షిగా కూడా ఇదే చెపుతా – విజయసాయి

. 'శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా తొలిసారి మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించాను.

Published By: HashtagU Telugu Desk
YCP MP Vijayasai Reddy

YCP MP Vijayasai Reddy

గత వారం రోజులుగా మీడియా లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల వ్యవహారం హాట్ టాపిక్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో అంత వీరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక అధికార పార్టీ శ్రేణులైతే మీమ్స్ , రీల్స్ చేస్తూ నానా హడావిడి చేస్తూనే ఉన్నారు. ఈ ఆరోపణలను శాంతి తో పాటు విజయసాయి ఇప్పటికే ఖండించినప్పటికీ..మదన్ మాత్రం విజయసాయి ని DNA టెస్ట్ కు రావాలంటూ సవాల్ విసిరారు.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా మరోసారి విజయసాయి ఈ ఇష్యూ ఫై స్పందించారు. తనకు ఏ పరాయి మహిళతోనూ అక్రమ సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా ఇదే మాట చెప్తానని ట్వీట్ చేశారు. ‘శాంతి కళింగిరిని 2020లో ఏపీ ఎండోమెంట్స్ ఆఫీసర్గా తొలిసారి మీట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూతురుగానే భావించాను. ఒక తండ్రిలా ఏ సహాయం కావాలన్నా చేశాను. తనకు కొడుకు పుట్టాడంటే వెళ్లి పలకరించాను. మా తాడేపల్లి ఇంటికి తీసుకొస్తే ఆశీర్వదించాను’ అని పేర్కొన్నారు.

Read Also : CM Revanth : వెంకయ్యనాయుడు, జైపాల్‌రెడ్డి‌లపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

  Last Updated: 20 Jul 2024, 02:53 PM IST