Prashanth Reddy : తెలుగు మూలాలు కలిగిన భారత సంతతి యువతేజం డాక్టర్ ప్రశాంత్ రెడ్డి అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడిపోయారు. కన్సాస్ రాష్ట్రంలోని మూడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. అయితే ఇక్కడ విజయం మాత్రం డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి షేరైస్ డేవిడ్స్‌ను(Prashanth Reddy) వరించింది. గత మూడు టర్మ్‌లలోనూ ఇక్కడి నుంచి షేరైస్ వరుసగా గెలిచారు. ఈసారి కూడా ఆమెనే విజయం వరించింది. అత్యధికంగా 53.2 శాతం ఓట్లను షేరైస్ సాధించగా.. ప్రశాంత్ రెడ్డి 42.8 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.
Also Read :Brutal Murder : ఆభరణాల కోసం పొరుగింటి మహిళ మర్డర్.. నెల్లూరులో దారుణం
ఇక లిబర్టేరియన్ పార్టీకి చెందిన స్టీవ్ రాబర్ట్స్ 4 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. కన్సాస్ రాష్ట్రంలోని మూడో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఐదు కౌంటీలు (పట్టణాలు) ఉన్నాయి. వీటిలో మియామి, ఫ్రాంక్లిన్, యాండర్సన్ కౌంటీలను ప్రశాంత్ రెడ్డి గెల్చుకున్నారు. అయితే అత్యధిక ఓట్లు ఉన్న జాన్సన్ కౌంటీని, వ్యాండోట్ అనే మరో చిన్న కౌంటీని షేరైస్ గెల్చుకున్నారు. ఎక్కువ ఓట్లు షేరైస్‌కే రావడంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
Also Read :Kavach In AP : ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే రూట్లకు రూ.2,104 కోట్ల రక్షణ ‘కవచం’
డాక్టర్ ప్రశాంత్ రెడ్డి బాల్యంలోనే వారి కుటుంబం మన భారతదేశంలోని చెన్నై సిటీ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఆయన విద్యాభ్యాసం అంతా అమెరికాలోనే జరిగింది. ఇంటర్నల్ మెడిసిన్, మెడికల్ అంకాలజీ, హెమటాలజీ కోర్సులను ఆయన చదివారు. అమెరికాలోని చాలా ప్రముఖ వైద్య సంస్థల్లో సేవలు అందించారు. అమెరికాపై 9/11 ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రశాంత్ ఆలోచన మారింది. అమెరికాకు ఏదైనా సాయం చేద్దామనే ఉద్దేశంతో ఆయన 2008లో అమెరికా ఎయిర్ ఫోర్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో చేరారు. దీంతోపాటు కన్సాస్ ప్రాంతంలో ప్రజల సహాయార్ధం చాలా కార్యక్రమాలను ప్రశాంత్ నిర్వహించారు. తద్వారా వారికి చేరువయ్యారు.