ఏపీ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు తన విలక్షణ అభిప్రాయాలను వ్యక్తం చేసే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ (Undavalli Arun Kumar) తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ( Pawan Kalyan) ప్రశంసించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ ఆశాజ్యోతిగా మారారని అభిప్రాయపడ్డారు. విభజన హామీలను సాధించడానికి, రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయం అని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ సర్కారుపై రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉండటంతో, పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకమైన దౌత్యనైపుణ్యంతో విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్‌లో రక్తపాతం
రాష్ట్రానికి రావాల్సిన 75,000 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి అందుకునే బాధ్యత పవన్ కళ్యాణ్‌కు ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. కేంద్రంతో పవన్ కళ్యాణ్ మంచి సంబంధాలు కలిగి ఉన్నారని, ఆయన జోక్యం చేసుకుంటే విభజన హామీలను రాబట్టుకోవచ్చని పేర్కొన్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పవన్ పేరుగాంచారని, ఆయన సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన విషయాన్ని కూడా వెల్లడించారు. విభజన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విఫలమయ్యారని, ఇప్పుడు ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకోవాలని సూచించారు. చంద్రబాబు వ్యూహాలను ఎవ్వరూ ఊహించలేరని, అయితే పవన్ మాత్రం తన నిబద్ధతతో, ధైర్యంతో ముందుకు వెళ్లే వ్యక్తి అని కొనియాడారు. పవన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎలాంటి అవినీతికి గురికాలేదని, ఆయనదొక స్వచ్ఛమైన రాజకీయ జీవితమని ప్రశంసించారు.
Hydraa : హైడ్రా తీరుపై మరోసారి హైకోర్టు సీరియస్
అలాగే తాను వైసీపీ లో చేరబోతున్నారన్న వార్తలపై కూడా స్పష్టత ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి పూర్తిగా విరమించుకున్నానని, ఇకపై ఏ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్న తనకు ఇప్పుడు అలాంటి రాజకీయ వేడికి అవసరమేమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆనందంగా జీవిస్తున్నానని తెలిపారు.