Site icon HashtagU Telugu

Group 2 Exam : గ్రూప్ 2, ఎస్‌బీఐ ఎగ్జామ్స్ ఈనెల 25నే.. ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం

Group 2 Exam

Group 2 Exam

Group 2 Exam : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతోమంది ఉద్యోగార్ధులు గ్రూప్ -2, ఎస్‌బీఐ క్లర్క్ పరీక్షలకు అప్లై చేసుకున్నారు. ఫిబ్రవరి 25న క్లరికల్ మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామని గత నవంబరులో విడుదల చేసిన నోటిఫికేషన్‌లోనే ఎస్‌బీఐ వెల్లడించింది. ఈవిషయం తెలిసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)  గ్రూపు-2 ప్రిలిమ్స్ ఎగ్జామ్‌కు కూడా ఫిబ్రవరి 25వ తేదీనే ఫిక్స్ చేసింది. రెండు పరీక్షలూ ఒకే రోజున ఉన్నందున ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రూపు-2 ఉద్యోగాలకు దాదాపు 4.5 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈనేపథ్యంలో గ్రూప్-2 ప్రిలిమ్స్ నిర్వహణ తేదీని వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. కొందరు అభ్యర్థులు విజయవాడలో ఎగ్జామ్ సెంటర్‌ను కేటాయించాలని దరఖాస్తులో కోరగా.. గుడివాడలో ఇచ్చారు. గ్రూపు-2 నోటిఫికేషన్‌ను(Group 2 Exam) ఏపీపీఎస్సీ గత డిసెంబరు 7న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ప్రిలిమ్స్ ఫిబ్రవరి 25న నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఎగ్జామ్ తేదీని నిర్ణయించే క్రమంలో అదే తేదీన జరిగే ఇతరత్రా జాతీయ, రాష్ట్ర స్థాయి పరీక్షల వివరాలను తనిఖీ చేయాలి. అలా చేయకపోవడం వల్లే ఈవిధమైన పొరపాటు ఏపీపీఎస్సీ ద్వారా జరిగిందని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఎస్‌బీఐ క్లరికల్ పరీక్షకు దరఖాస్తు చేసిన వారు హాల్‌టికెట్లను తమకు పంపించాలని అభ్యర్థులకు ఏపీపీఎస్సీ విజ్ఞప్తి చేసింది. పరీక్ష విషయంలో ఎస్‌బీఐ ఉన్నతాధికారులను సంప్రదించాం. మాకు అందిన 10 మంది అభ్యర్థుల హాల్‌టికెట్లు వారికి పంపగా.. వారు మార్చి 4న (మరో స్లాట్) పరీక్ష నిర్వహించేందుకు ఆమోదించారు. ఇంకా ఎవరైనా ఉంటే ఫిబ్రవరి 19లోగా తెలియజేయాలి. ఆ వివరాలను వారికి పంపి పరీక్ష తేదీల మార్పునకు కృషి చేస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి శనివారం(ఫిబ్రవరి 17న) ప్రకటన జారీ చేశారు.

అభ్యర్థులు విజ్ఞప్తులు పంపాల్సిన ఈమెయిల్ : appschelpdesk@gmail.com

Also Read : Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు

ఎస్‌బీఐలో మరో 80 పోస్టుల భర్తీ

ముంబైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), డిప్యూటీ మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), మేనేజర్‌ (సెక్యూరిటీ అనలిస్ట్‌), అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(అప్లికేషన్‌ సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీనిద్వారా మొత్తం 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంసీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.750. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు మినహాయింపు ఉంది. సరైన అర్హతలున్నవారు మార్చి 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

Also Read : Acidity: మారుతున్న సీజ‌న్‌.. గ్యాస్‌, ఎసిడిటీ నుంచి ఉప‌శ‌మనం పొందండిలా..!

Exit mobile version