TTD Dispute : TTD చైర్మ‌న్ గా క్రిస్టియ‌న్ ! స్వామీజీల మౌన‌మేల‌.!!

టీటీడీ(TTD Dispute) చైర్మ‌న్ గా ఎంపికైన‌ క‌రుణాక‌ర్ రెడ్డి ప‌క్కా క్రిస్టియ‌న్. వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని తెలిసి కూడా ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 04:37 PM IST

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD Dispute) చైర్మ‌న్ గా ఎంపికైన‌ క‌రుణాక‌ర్ రెడ్డి ప‌క్కా క్రిస్టియ‌న్. ప్ర‌తిప‌క్షాల నుంచి హిందూ స‌మాజం నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తుంద‌ని తెలిసి కూడా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆయ‌న‌కు అవ‌కాశం ఇచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తేడా. అప్ప‌ట్లో సుధాక‌ర్ యాద‌వ్ ను చైర్మ‌న్ గా చంద్ర‌బాబు ఎంపిక చేశారు. ఆ స‌మ‌యంలో అత‌ని ఫోటోను ఎవ‌రో క్రిస్టియ‌న్ సంబ‌రాల్లో వాడారు. ఇక దాన్ని ప‌ట్టుకుని ఆనాడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ నానా యాగీ చేసింది. ఇప్పుడు చైర్మ‌న్ గా క‌రుణాక‌ర్ రెడ్డిని నియ‌మించ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి న‌మ్ముకున్నోళ్ల‌కు ఏదైనా చేస్తార‌ని నిరూపించారు.

ఏ హిందూమ‌ఠాధిప‌తి, పీఠాధిప‌తి నోరు పెగ‌లడంలేదు(TTD Dispute)

అన్య‌మ‌త‌స్తులు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంలో (TTD Dispute)ఉద్యోగులుగా ఉండ‌కూడ‌ద‌ని హిందూ మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు చేసే వాద‌న‌. ఎందుకంటే, వాళ్లు ఉంటే అన్య‌మ‌త ప్ర‌చారం చేస్తార‌ని అభిప్రాయం. కానీ, ఇప్పుడు ఏకంగా చైర్మ‌న్ గా అన్య‌మ‌త‌స్తుడ్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియ‌మించారు. ఇప్పుడు ఏ హిందూమ‌ఠాధిప‌తి, పీఠాధిప‌తి నోరు పెగ‌లడంలేదు. ప్ర‌త్యేకించి ఆధ్యాత్మిక గురువుగా ల‌క్ష‌లాది మంది తెలుగు ప్ర‌జ‌లు ఆరాధించే శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నిజియ్య‌ర్ చీమ‌కుట్టిన‌ట్టు ఉండిపోయారు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆత్మ‌గా చెప్పుకునే విశాఖ శార‌ద‌పీఠం అధిప‌తి స్వ‌రూపానందేద్ర‌స్వామి పెద‌వి క‌ద‌ల‌డంలేదు. వీళ్లే కాదు, సందుగొందుల‌కు ఒక‌రు అన్న‌ట్టు క‌షాయం ధ‌రించే స్వామీజీలు బోలెడు. వాళ్లెవ‌రూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యాన్ని అభ్యంత‌ర‌పెట్ట‌డానికి ముందుకు రాలేదు. ఇక బీజేపీకి అన‌ధికార ఆయువుప‌ట్టుగా ఉండే ఆర్ఎస్ఎస్, భ‌జ‌రంగ‌ద‌ళ్, విశ్వ‌హిందూప‌రిష‌త్ త‌దిత‌ర సంస్థ‌లు మౌనంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆత్మ‌గా చెప్పుకునే విశాఖ శార‌ద‌పీఠం అధిప‌తి

ఏపీ సీఎంగా చంద్ర‌బాబునాయుడు ఉన్న స‌మ‌యంలో దుర్గ‌గుడి వ‌ద్ద ఫ్లైవోర్ నిర్మాణ నిమిత్తం కొన్ని దేవాలయాల‌ను తొల‌గించారు. ఆ త‌రువాత వాటిని మ‌రొక ప్రాంతంలో ప్ర‌తీష్టించారు. దాన్ని నిర‌సిస్తూ పెద్ద ఎత్తున ఆనాడు స్వామీజీలు, మ‌ఠాధిప‌తులు, పీఠాధిప‌తులు రోడ్ల మీద‌కు వ‌చ్చారు. రాస్తారోకోలు, ధ‌ర్నాలు నిర్వ‌హించారు. ఆ చైత‌న్యం ఇప్పుడు హిందూ సంస్థ‌ల్లో ఏమైయిందో అర్థం కావ‌డంలేదు. ఈ నియామ‌కాన్ని వైసీపీ, బీజేపీ సంయుక్తంగా చేశాయా? అనే అనుమానం క‌లుగుతోంది. లేదంటే, బీజేపీకి వెన్నుద‌న్నుగా ఉండే హిందూ సంస్థ‌లు మౌనంగా ఉండేవి కాద‌ని అనుమానించే వాళ్లు అనేకులు. రేపోమాపో క‌రుణాక‌ర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా(TTD Dispute) బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్నారు. ఆ లోపు న్యాయ‌పోరాటం చేస్తే, ఆ నియామ‌కాన్ని ఆపేయ‌గ‌ల స‌త్తా హిందూ సంస్థ‌లు లేక‌పోలేదు. కానీ, ఏ హిందూ సంస్థా సీరియ‌స్ గా ఆ నియామ‌కాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డం విచిత్రం.

సొంత మ‌నుషుల‌కు ప్రాధాన్యం ఇచ్చే ధోర‌ణి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD Dispute)బ‌స్సు టిక్కెట్ల వెనుక జెరూస‌లెం ప్రాముఖ్య‌త‌ను ముద్రించారు. అన్య‌మ‌త ప్ర‌చారాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా దేవాల‌యాల కూల్చివేత‌, విగ్ర‌హాల ధ్వంసం, ర‌థాల కాల్చివేత సంఘ‌ట‌న‌లు ఎన్నో చూశాం. ఇప్పుడు ఏకంగా క్రిస్టియ‌న్ మ‌తాన్ని స్వీక‌రించిన కరుణాక‌ర్ రెడ్డిని టీటీడీ చైర్మ‌న్ గా నియ‌మించ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత మ‌నుషుల‌కు చేసే మేలుకు ప‌రాకాష్ట‌. అంతేకాదు, క‌రుణాక‌ర్ రెడ్డి స్వ‌స్థ‌లం క‌డ‌ప జిల్లా. ప్ర‌స్తుత ఛీప్ సెక్ర‌ట‌రీగా ఉన్న జ‌వ‌హ‌ర్ రెడ్డి, డీజీపీగా ఉన్న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అంతా ఒకటే ప్రాంతం, ఒక‌టే జిల్లా. అయిన‌ప్ప‌టికీ ఎలాంటి సామాజిక న్యాయం, ప్రాంతీయ స‌మ‌తుల్య‌త లేదు. ఎవ‌రేమ‌నుకున్నా ప‌ర్వాలేద‌నే సొంత మ‌నుషుల‌కు ప్రాధాన్యం ఇచ్చే ధోర‌ణి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఉంది. అదే చంద్ర‌బాబు సొంత సామాజిక‌వ‌ర్గానికి ప‌ద‌వి ఇవ్వ‌డానికి భ‌యం. ఆయ‌న ప్రాంతానికి చెందిన వాళ్ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డానికి సందేహిస్తారు. త‌న‌వాళ్ల‌ను ఎవ‌ర్నీ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డ‌ని చంద్ర‌బాబు గురించి తెలిసిన వాళ్లు ఎవ‌రైనా చెబుతారు.

అన్య‌మ‌త‌స్తుల్ని భారీగా టీటీడీలో నియామ‌కం(TTD Dispute)

గ‌తంలోనూ క‌రుణాక‌ర్ రెడ్డి టీటీడీ చైర్మ‌న్ గా ప‌నిచేశారు. స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సీఎంగా ఉన్న‌ప్పుడు చైర్మ‌న్ గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆ స‌మ‌యంలోనే ఏడుకొండ‌లు కాదు, మూడు కొండ‌లు అంటూ ర‌హ‌స్య జీవో బ‌య‌ట‌కు వ‌చ్చింది. అత్యంత స‌న్నిహితునిగా వైఎస్ కు మెలిగే వారు. తిరుప‌తి ఎమ్మెల్యేగా 2019 ఎన్నిక‌ల్లో కేవ‌లం 708 ఓట్ల‌కు ఆయ‌న గెలుపొందారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండుసార్లు ఆయ‌న ఓడిపోయారు. ఇప్పుడు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ గా రెండోసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌యాంలో  (TTD Dispute)ఛాన్స్ కొట్టేశారు. క్రిస్టియ‌న్ గా ఉన్న ఆయ‌న స‌ర్టిఫికేట్ గ‌త రెండు రోజులుగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వైరల్ అవుతోంది. అప్ప‌ట్లో అన్య‌మ‌త‌స్తుల్ని భారీగా టీటీడీలో నియామ‌కం చేశార‌ని ఆయ‌న మీద ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు అదే పంథాను కొన‌సాగిస్తార‌ని హిందూ సంస్థ‌లకు అనుమానం లేక‌పోలేదు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నియామ‌కాన్ని ఖండించే ధైర్యం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Also Read : TTD Meeting : టీటీడీ పాలకమండలి.. వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన చివరి సమావేశం.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం జంబో పాల‌క మండ‌లి ఏర్ప‌డింది. మొత్తం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించింది. హిందూ సంస్థ‌లు గళం విప్పిన తర్వాత 52 మంది కుదించి నియామ‌కాల్ని ఖ‌రారు చేశారు. రాజకీయ పునరావాసంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని వైసీపీ మార్చేసింది. ఇదే విష‌యాన్ని బీజేపీ ఏపీ చీఫ్ పురంధ‌రేశ్వ‌రి ప్ర‌శ్నిస్తున్నారు. హిందూధ‌ర్మాన్ని అనుస‌రించే వాళ్ల‌కు మాత్ర‌మే ఆ ప‌ద‌వి ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఆ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆమె డిమాండ్ చేశారు. అంతేకాదు, కేంద్రానికి కూడా ఈ నియామ‌కం మీద లేఖ రాయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికైనా హిందూ మఠాధిప‌తులు, పీఠాధిప‌తులు మేల్కొని రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ నియామ‌కాన్ని అడ్డుకోవాల‌ని విశ్వహిందూప‌రిష‌త్ నేత రావిపూడి శిశ‌ధ‌ర్‌ పిలుపునిచ్చారు.

Also Read : TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది రెండుసార్లు బ్రహ్మోత్సవాలు!