Site icon HashtagU Telugu

Theft : ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం

Thieves Break Into Ap Assem

Thieves Break Into Ap Assem

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణ(Andhra Pradesh Legislative Assembly Premises)లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయని భావించినా, నిన్న జరిగిన దొంగతనం ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారోత్సవం (Swearing-in ceremony of MLCs)సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు పెద్ద ఎత్తున ఉండగా, దొంగలు మాత్రం తమ చేతివాటం చూపించారు. ఈ సంఘటనలో టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10 వేలు, ఆయన గన్‌మన్ జేబులో రూ.40 వేలు, హైకోర్టు లాయర్ జేబులో రూ.50 వేలు, మరొక వ్యక్తి జేబులో రూ.32 వేలు మాయం అయ్యాయి. మొత్తం మీద దొంగలు సుమారు రూ.4 లక్షల మేర చోరీ చేసినట్లు భావిస్తున్నారు.

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణ‌యం.. ముంబై నుంచి గోవాకు!

ఈ ఘటనతో శాసనసభ భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. రాజధాని అమరావతిలోనే అసెంబ్లీ సముదాయంలో ఇలాంటి దొంగతనాలు జరగడం ఊహించని పరిణామంగా మారింది. సాధారణ ప్రజలకు కంటే, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే దొంగలు సాహసానికి ఒడిగట్టడం భద్రతాపరమైన లోపాలను స్పష్టంగా కనిపిస్తుంది. అసెంబ్లీ ఆవరణలో సీసీటీవీ కెమెరాలు, భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ, ఇంత పెద్ద మొత్తంలో నగదు అపహరణకు గురికావడం బాధ్యతారాహిత్యాన్ని వెల్లడిస్తోంది.

RCB vs GT: సొంత మైదానంలో బెంగ‌ళూరుకు భారీ షాక్ ఇచ్చిన గుజ‌రాత్‌!

ఈ ఘటనపై అసెంబ్లీ భద్రతా విభాగం, పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. దొంగతనానికి పాల్పడ్డవారిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ లాంటి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతాపరమైన వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.