CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్

తెలంగాణ ప్రజాతీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. దీంతో అక్కడ మార్పు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మేల‌కు సీట్లు ఇవ్వ‌కుండా కొత్త‌వార‌కి అవ‌కాశం ఇస్తే రిజల్ట్ మ‌రోలా ఉండేద‌న్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. దీంతో అక్కడ మార్పు మొద‌లైన‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మేల‌కు సీట్లు ఇవ్వ‌కుండా కొత్త‌వార‌కి అవ‌కాశం ఇస్తే రిజల్ట్ మ‌రోలా ఉండేద‌న్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జగన్ మోహ‌న్ రెడ్డి కీల‌క నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరిగి అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు ర‌చిస్తున్నారు. పార్టీకి కుటుంబానికి స‌న్నిహింత‌గా ఉన్నా సరే గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు.

వైసీపీ పార్టీ ఎవ్వ‌రినీ దూరం చేసుకోద‌ని, అయితే రానున్న ఎన్నిక‌లు పార్టీకి ప్ర‌భుత్వానికి ప్ర‌తిష్టాత్మ‌కం అని చెపుతున్నారు పార్టీ పెద్ద‌లు. ఏ క్రమంలో ఎన్నికల్లో గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయిస్తామ‌ని అంటున్నారు.ఇందులో భాగంగా తాజాగా 11 నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను ప్రకటించారు. దీంతో ఎమ్మేల్యేలు మంత్ర‌ల్లో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం మొద‌లైంది.రానున్న రోజుల్లో మ‌రిన్ని నియోజ‌క వ‌ర్గాల‌కు ఇంచార్జ్ ల‌ను నియ‌మిస్తామ‌ని మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ తెలియ‌జేశారు. మరో 36 నియోజకవర్గాల్లోనూ మార్పులకు పార్టీ సిద్దం అయినట్లు సమాచారం.

తొలి జాబితాలో ముగ్గురు మంత్రులకు స్థానచలనం కలిగింది. ఆ తర్వాత ఆరుగురు మంత్రుల విషయంలోనూ నిర్ణయం రానుంది. రాయలసీమలోని రెండు జిల్లాలకు చెందిన మంత్రులు…ఉత్తరాంధ్ర, గోదవరి జిల్లాల్లోని మరో నలుగురు మంత్రులకు స్థాన చలనం తప్పదంటున్నారు. సీనియర్ నేతలను కొన్ని చోట్ల మార్పు ఖాయమని పార్టీ నిర్ణయించింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలో సీటు ఉంటుందా ఊడుతుందా అని నేతలు టెన్షన్ పడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ప్రజలు ఇచ్చిన తీర్పుతో సీఎం జగన్ ముందుగానే అలర్ట్ అవ్వడం పార్టీకి మంచి జరుగుతుందేమో చూడాలి.

Also Read: Vastu Tips: కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు వాస్తు పూజ చేయడం వల్ల కలిగే లాభం ఏంటో మీకు తెలుసా?