Posani Krishna Murali: పోసానికి సూళ్లూరుపేట పోలీసుల నోటీసులు

చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు.

Published By: HashtagU Telugu Desk
sullurpeta police notices for posani krishna murali

sullurpeta police notices for posani krishna murali

Posani Krishna Murali : సినీ నటుడు, వైసీపీ మాజీ నాయకుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. చంద్రబాబు, పవన్, లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో సుళ్లూరుపేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు రావాలని పోలీసులు పోసానిని ఆదేశించారు. నిన్న సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్తున్న సమయంలో ఈ నోటీసులు అందించారు.

Read Also: Telangana High Court : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసు.. హైకోర్టు కీలక తీర్పు

పోసాని కృష్ణమురళికి గత నెలలో ఈ కేసులోనే కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం నాడు సీఐడీ కార్యాలయానికి వచ్చి సంతకం చేసి వెళ్లాలని తెలిపింది. ఈ క్రమంలోనే సంతకం చేసి తిరిగి వెళుతుండగా పోసానికి సీఐడీ కార్యాలయం దగ్గర తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పోలీసులు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు.

కాగా, ఫిబ్రవరి 26న హైదరాబాద్ లోని పోసాని నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలోని వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 16 కేసులు ఆయనపై నమోదయ్యాయి. సీఐడీ కూడా ఆయనను అదుపులోకి తీసుకుని విచారించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో మార్చి 22న పోసాని గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు మార్ఫింగ్ అభియోగాలతో ఫిబ్రవరి 26న ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

Read Also: Falaknuma Express: రెండుగా విడిపోయిన ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌.. తప్పిన ప్రమాదం

 

  Last Updated: 08 Apr 2025, 12:05 PM IST