అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల(Sticker Dog) ..కాదేదీ రాజకీయాలకు అతీతం అన్నాడో సినీ రచయిత. ఇప్పుడు ఏపీ రాజకీయాలకు ఆ సినిమా డైలాగును వర్తింప చేస్తే అచ్చుగుద్దినట్టు సరిపోతోంది. ఎందుకంటే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan mohan Reddy) చేస్తోన్న స్టిక్కర్ల ప్రచారంలోకి ఒక కుక్క చేరింది. ఎలా చేరింది? ఎందుకు చేరింది? ఎప్పుడు చేరింది? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ఇటీవల `జగనన్నే మా నమ్మకం` అనే స్టిక్కర్లను ఇంటింటికి వెళ్లి గృహ సారథులు, వలంటీర్లు పంచుతున్నారు. ఇళ్లకు, గోడలకు, వాహనాలకు..ఇలా ఎక్కడబడితే అక్కడ స్టిక్కర్లు వేస్తున్నారు. ఒక ఉద్యమంలా వైసీపీ ఈ కార్యక్రమాన్ని చేస్తోంది.
అగ్గిపుల్ల, సబ్బు బిళ్ల, కుక్క పిల్ల ..కాదేదీ రాజకీయాలకు అతీతం(Sticker Dog)
ఏప్రిల్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రోగ్రామ్ ను వైసీపీ నిర్వహించేలా ప్లాన్ చేసింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, గృహ సారథులు, వలంటీర్లు, క్యాడర్ అందరూ కలిసి ప్రతి ఇంటికి జగనన్న స్టిక్కర్ ను అతికించాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ గల్లంతు అయినట్టేనని జగన్మోహన్ రెడ్డి (Jagan mohan Reddy) ఇటీవల సంకేతాలు ఇచ్చారు. గడపగడపకు ప్రోగ్రామ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలకు పలు చోట్ల చేదు అనుభవం ఎదురైయింది. ఇప్పుడు స్టిక్కర్లతో పార్టీకి పాజిటివ్ వేవ్ తీసుకొద్దామని జగన్మోహన్ రెడ్డి రచించిన ప్రోగ్రామ్ అది. అందుకే, సంచుల్లో స్టిక్కర్లు వేసుకుని ఎమ్మెల్యేలు ఇళ్ల వెంట తిరుగుతున్నారు.
గోడకు ఉన్న స్టిక్కర్ ను ఒక కుక్క లేగేసింది
ఓ గ్రామంలోని గోడకు ఉన్న స్టిక్కర్ ను ఒక కుక్క (Sticker Dog) లేగేసింది. దానికి ఆ విధంగా ఎవరో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ కుక్క వెళ్లి ఆ స్టిక్కర్ ను పీకేసే సమయంలో షూట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్ అయింది. ఫలితంగా ఏపీ రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, పోలీస్ స్టేషన్ వరకు ఆ కుక్క వ్యవహారం చేరింది. వైరల్ గా మారిన ఆవీడియోలోని కుక్క మీద కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఆ కుక్కను, దానికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కేసులను నిరసిస్తూ అలాంటి ఫిర్యాదు కొందరు మహిళలు ఇచ్చిన తరువాత మీడియా ముందుకొచ్చారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(Jagan mohan Reddy) పబ్లిసిటీ పిచ్చిను విమర్శించారు.
మహిళలు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాల్ పోస్టర్ ను చింపివేసిన కుక్కపై(Sticker Dog) పోలీసులకు ఫిర్యాదు అందింది. వైఎస్ జగన్ పోస్టర్‌ను కుక్క చింపేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు మహిళలు విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రిని అవమానించిన కుక్కపైనా, దాని వెనుక ఉన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదుదారు కోరారు. ఆ ఫిర్యాదును ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్త దాసరి ఉదయశ్రీ వ్యంగ్యంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
Also Read : Jagan : చంద్రబాబు సెల్పీ ఛాలెంజ్ కు జగన్ మరో ఛాలెంజ్
మీడియాతో ఆమె మాట్లాడుతూ.. 151 అసెంబ్లీ సీట్లు సాధించిన జగన్ మోహన్ రెడ్డిపై(Jagan mohan Reddy) తమకు అపారమైన గౌరవం ఉందని, అలాంటి నాయకుడిని కుక్క అవమానించడం రాష్ట్ర ఆరు కోట్ల మంది ప్రజలను బాధించిందని అన్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఓ ఇంటిపై అతికించిన జగన్ ఫోటో ఉన్న స్టిక్కర్‌ను కుక్క (Sticker Dog)చింపివేస్తున్న వీడియో కూడా వైరల్ అయిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ప్రతిపక్ష టీడీపీ ఆ వీడియోను చూపిస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం గమనార్హం.
Also Read : CM Jagan: సీఎం జగన్ లండన్ పర్యటన ఎందుకో తెలుసా?