Srisailam Dam : కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది, దాని ఉపనదుల్లో వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. ఈ వరద నీరు వరుసగా ప్రాజెక్టుల ద్వారా దిగువకు చేరడంతో, ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వేగంగా నిండిపోతోంది. ఎగువనుంచి నీటి ప్రవాహం భారీగా వస్తుండటంతో అధికారులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు.
శ్రీశైలం పైభాగంలో ఉన్న తుంగభద్ర, జూరాల ప్రాజెక్టుల్లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరడంతో, అధికారులు అక్కడ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం నేరుగా శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. నిన్నటివరకు మూడు గేట్లను ఎత్తి నీటిని వదులుతుండగా, ఎగువనుంచి ప్రవాహం మరింత పెరగడంతో అధికారులు అదనంగా మరిన్ని రెండు గేట్లను తెరిచి, మొత్తం ఐదు గేట్లను 10 అడుగుల మేర ఎత్తారు.
Good News : ఆగస్టు 1 నుంచి ఏపీలో స్పౌజ్ పింఛన్‌లు
అధికారుల ప్రకారం, ప్రస్తుతం ఎగువ నుంచి 2,32,290 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. ఈ నీటిని నియంత్రించేందుకు గేట్ల ద్వారా 2,01,743 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ వైపులలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు కూడా పూర్తి సామర్థ్యంతో నీటిని విడుదల చేస్తున్నాయి. శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతానికి అది 883 అడుగుల వద్ద ఉంది. మరికొద్ది సమయంలో గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని అధికారులు గంట గంటకు మానిటరింగ్ చేస్తున్నారు. అవసరమైతే మరో గేటును కూడా ఎత్తేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వరద ప్రభావం కారణంగా దిగువ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అప్రమత్తం ఉండాలని సూచనలు జారీ చేశారు. ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున కృష్ణా నది తీరప్రాంతాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు ఇచ్చారు.
ఇక గోదావరిలో పోలవరం వద్ద వరద ప్రవాహం మరింతగా పెరిగింది. 48 గేట్లను పూర్తిగా తెరచి 6,557,241 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి గోదావరిలోకి ప్రవేశిస్తున్న వరద నీరు కూడా పెరుగుతుండటంతో, అధికారులు పోలవరం వద్ద కూడా పూర్తి అప్రమత్తతతో ఉన్నారు.
వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదీ తీరాలకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు.
Illegal Surrogacy Racket : బిచ్చగాళ్లకు పోర్న్ వీడియోలు చూపించి వీర్యం సేకరణ