వైసీపీ నేతలు (YCP Leaders) , వైసీపీ సపోటర్స్ , వైసీపీ సోషల్ మీడియా సైన్యం..ఇలా వైసీపీ కి జై కొట్టిన వారంతా ఇప్పుడు వణికిపోతూ కాళ్ల బేరానికి వస్తున్నారు. అధికార మదంతో వైసీపీ నేతలు, వైసీపీ శ్రేణులు, ఆఖరికి వైసీపీ సోషల్ మీడియా వారు సైతం ఐదేళ్ల పాటు ఎన్ని అరాచకాలు..ఎన్ని దౌర్జన్యాలు..ఎన్ని హత్యలు..ఎన్ని అక్రమ కేసులు, సోషల్ మీడియా ట్రోల్స్ పెట్టి ఎంత బాధపెట్టారో తెలియంది కాదు. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ను సైతం జైల్లో పెట్టించారు..పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో , నేతను రోడ్ల మీదకు వచ్చి నిరసన చేసేలా చేసారు. ఇంట్లో ఉన్న ఆడవారిని సైతం వదల్లేదు. టీడీపీ, జనసేన శ్రేణులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టి వేధించారు..సోషల్ మీడియా వేదికగా కూడా ఎన్ని బూతులు అన్నారో..అనిపించారో కూడా తెలియంది కాదు. ఇన్ని చేసిన వీరిని కూటమి బదులు తీర్చుకోకుండా ఉంటాడా..? అందరి లెక్క సరిచేసి..ఎలాంటి శిక్షలు వేయాలో..ఏ రేంజ్ లో వేయాలో అన్ని సిద్ధం చేసింది. కేవలం నేతలనే కాదు జగన్ అండ చూసుకొని నోర్లు పారేసుకున్న వారి లెక్కలు సైతం సరిచేసే పనిలో పడింది. ఓ పక్క నేతలపై కేసులు పెట్టి జైలు వేస్తూనే మరోపక్క సోషల్ మీడియా వారిపై నిఘా పెట్టి అరెస్టుల పర్వం స్టార్ట్ చేసింది. దీంతో వైసీపీ కి జై కొట్టిన వారంతా ఇప్పుడు భయం తో వణికిపోతున్నారు. ఆనాడు నోర్లు పారేసుకున్న వారంతా ఇప్పుడు క్షేమపణలు కోరుతూ కాళ్ల బేరానికి వస్తున్నారు. అందులో శ్రీ రెడ్డి ఒకరు.
శ్రీ రెడ్డి (Sri Reddy)..సోషల్ మీడియా లో ఈమె గురించి తెలియని వారు ఉండరు. అప్పుడెప్పుడో తనకు సినిమా అవకాశాలు రాకుండా చేస్తున్నారని..కనీసం మా సభ్యత్వం కూడా ఇవ్వడం లేదంటూ ఫిలిం ఛాంబర్ ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపి మీడియా చానెల్స్ ను తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత చిత్రసీమలో చాలామంది తనతో ఎఫైర్లు నడిపించారని చెప్పి పలువురి హీరోల పేర్లు , దర్శకులు , నిర్మాతల పేర్లు తెలిపి షాక్ ఇచ్చింది. ఈమె చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని..ఆమెను పట్టించుకోవద్దంటూ వారంతా డిసైడ్ కావడమే కాదు పోలీసులు కేసులు కూడా నమోదు చేయడం తో హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చేసింది. అప్పటి నుండి వైసీపీ కి సపోర్ట్ ఇస్తూ..జగన్ ఫై ఎవరైనా విమర్శలు , ఆరోపణలు చేస్తే వారిపై ఇష్టంవచ్చినట్లు మాట్లాడుతూ వైసీపీ కి దగ్గరైంది. ఇక చంద్రబాబు , పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ఎంతోమందిపై నోరు పారేసుకున్న ఈమె..ఇటీవల కూటమి సర్కార్ అధికారం లోకి రావడం తో కాస్త సైలెంట్ అయ్యింది. ఇక ఇప్పుడు కూటమి సర్కార్ అరెస్ట్ ల పర్వం మొదలుపెట్టడం తో శ్రీ రెడ్డి కి సీన్ అర్థమై క్షేమపణలు కోరుతూ తనను , తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టొద్దంటూ వేడుకుంటుంది.
జగన్ తిట్టమంటే బూతులు తిట్టాం… సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి, మీ కుటుంబ సభ్యులని బూతులు తిట్టాంచాడు..మమ్మల్ని వదిలేయండి, జగన్, సజ్జల ని అరెస్ట్ చేయండి. లోకేష్ గారు, పవన్ గారు, అనిత గారు సారీ.. మమ్మల్ని వదిలేయండి. ఇకపై మీపై కానీ మీ కుటుంబ సభ్యులపై కానీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలే కాదు అసలు ఏమిమాట్లాడమని చెపుతూ వీడియో ఒకటి విడుదల చేసింది. అయితే కూటమి శ్రేణులు మాత్రం ఈమెని అస్సలు వదిలిపెట్టొదంటూ..ఈమె ఏమేమి అన్నదో అవన్నీ గుర్తు చేస్తూ ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని కోరుతున్నారు .
జగన్ తిట్టమంటే బూతులు తిట్టాం… సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి, మీ కుటుంబ సభ్యులని బూతులు తిట్టాంచాడు..
మమ్మల్ని వదిలేయండి, జగన్, సజ్జల ని అరెస్ట్ చేయండి.లోకేష్ గారు, పవన్ గారు, అనిత గారు సారీ.. మమ్మల్ని వదిలేయండి.. pic.twitter.com/n8DWtEsnJE
— Swathi Reddy (@Swathireddytdp) November 8, 2024
Read Also : Health Tips : ఏదైనా కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపిస్తుందా? ఈ సంకేతాన్ని ఎప్పుడూ విస్మరించవద్దు..!