Maha Kumbh Mela : ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కోసం గుంతకల్లు డివిజన్(Guntakal Division) మీదుగా భారత రైల్వే అధికారులు రెండు ప్రత్యేక రైళ్లను నడిపే ప్రకటనను విడుదల చేశారు. ఈ ప్రత్యేక రైళ్లలో మొదటి రైలు తిరుపతి-దానాపూర్ (రైలు నం. 07117) 14వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి, రెండు రోజుల తర్వాత 16వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది.
ఇదే గమనంలో, తిరుగు ప్రయాణ రైలు (రైలు నం. 07118) 17వ తేదీ మధ్యాహ్నం 3:15 గంటలకు దానాపూర్ నుండి బయలుదేరి 19వ తేదీ మధ్యాహ్నం 1:55 గంటలకు తిరుపతికి చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రయాణ మార్గంలో రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూలు, గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్, ఇందానగర్, కాచిగూడ, మల్కాజ్‌గిరి, చర్లపల్లి, ఖాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బాలార్షా, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగపూర్, ఇటార్సి, పిప్రియా, జబల్పూర్, కట్ని, సట్నా, మానిక్‌పూర్, ప్రయాగరాజ్ చౌకీ, మీర్జాపూర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అర స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నాయి.
India Test Team: రోహిత్ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఎవరు ఎంపిక అవుతారు? రేసులో యువ ఆటగాళ్లు!
అలాగే, రెండవ ప్రత్యేక రైలు (రైలు నం. 07119) 18వ తేదీ రాత్రి 11:45 గంటలకు తిరుపతి నుండి బయలుదేరి 20వ తేదీ రాత్రి 11:55 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. దాని తిరుగు ప్రయాణ రైలు (రైలు నం. 07120) 21వ తేదీ మధ్యాహ్నం 3:15 గంటలకు దానాపూర్ నుండి బయలుదేరి 23వ తేదీ మధ్యాహ్నం 1:45 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైలు కూడా రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, సూళేహళ్లి, సేడం, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బాలార్షా, చంద్రాపూర్, సేవాగ్రాం, నాగపూర్, ఇటార్సి, పిప్రియా, జబల్పూర్, కట్ని, సట్నా, మానిక్‌పూర్, ప్రయాగరాజ్ చౌకీ, మీర్జాపూర్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అర స్టేషన్ల మీదుగా ప్రయాణించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లను మహా కుంభమేళాకు సంబంధించిన భక్తుల పర్యటన సౌకర్యాలను మెరుగుపరచాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
Health Tips : మఖానాను పాలలో కలిపి తింటే ఏమవుతుంది? నిపుణుల నుండి తెలుసుకోండి