Site icon HashtagU Telugu

AP: కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలను ప్రకటించిన షర్మిల

Sharmila announced 9 guarantees of the ap Congress party

Sharmila announced 9 guarantees of the ap Congress party

YS Sharmila: ఈరోజు విజయవాడ(Vijayawada)లో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని(Election campaign) ప్రారంభించారు. ఏపీలో వైసీపీ(ycp), టీడీపీ(tdp) పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీ(9-guarantees)లను ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారెంటీలు..

1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు
2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500
3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ
4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర
5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత
6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య
7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ
8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు
9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను… ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను

Read Also: Freshers Hiring : టీసీఎస్‌లో ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్ షురూ.. వివరాలివీ

ఆ రెండు పార్టీలు మోడీకి బానిసలు..షర్మిల

రాష్ట్రానికి బీజేపీ ఎలాంటి మేలు చేయకపోయినా… వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని విమర్శించారు. ఏపీలో ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా తయారయ్యాయని అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరేనని… ఒకరిది బీజేపీతో బహిరంగ పొత్తు అయితే, మరొకరిది రహస్య పొత్తు అని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆపై విడిపోయిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇక, నిర్మలా సీతారామన్ అయితే జగన్ ను మోదీ దత్తపుత్రుడిగా అభివర్ణించారని షర్మిల వెల్లడించారు.

Read Also: Phone Tapping Case: టాస్క్ ఫోర్స్ వాహనాల్లో అక్రమ కార్యకలాపాలు

ఏపీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. మరో రెండ్రోజుల్లో అభ్యర్దుల్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు 15 వందల దరఖాస్తులు వచ్చినట్టు వైఎస్ షర్మిల తెలిపారు. అభ్యర్దుల జాబితాపై చర్చించేందుకు వైఎస్ షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. అభ్యర్ది పనితనం ఆధారంగా సర్వే చేయించి టికెట్ కేటాయిస్తామని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 9 గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. 9 ఎన్నికల గ్యారంటీలను ప్రకటించారు.