Site icon HashtagU Telugu

Shanti Husband Madan Mohan : నా భార్య అంత అబద్దం చెపుతుంది..ఆ బిడ్డ కు తండ్రి ఐవీఎఫ్ – మదన్

Shanti Husband Madan Mohan

Shanti Husband Madan Mohan

దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి భర్త (Shanti Husband Madan Mohan) మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తన భార్య చెపుతుంది మొత్తం అబద్దమని..ఆ బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి అని వాపోయాడు. రెండు రోజులుగా సోషల్ మీడియా లో , అలాగే మీడియా చానెల్స్ లలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (MP Vijaya Sai )..దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి ( Shanthi ) ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎంపీ విజయసాయి రెడ్డి వల్ల తన భార్య శాంతి గర్భం దాల్చిందంటూ ఆమె భర్త మదన్ (Madan) సంచలన ఆరోపణలు చేయడం తో వారిద్దరూ ఆ వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే. నిన్న మీడియా ముందు కన్నీరు పెట్టుకుంటూ..తన బిడ్డకు విజయసాయి కి సంబంధం లేదని , సుభాషే తన బిడ్డకు తండ్రి అని శాంతి తెలిపింది. ఇక విజయసాయి రెడ్డి కూడా తన ఫై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరిద్దరి వ్యాఖ్యల విన్న మదన్ మోహన్..ఈరోజు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తేలేవరకు తాను నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. ‘విజయసాయి, సుభాష్ లపై నాకు అనుమానం ఉంది. ఎవరైనా సరే DNA టెస్టుకు రావాల్సిందే. ఇది నా జీవితం, ఆత్మగౌరవానికి సంబంధించినది. ఒకవేళ వారు తండ్రి కాదని తేలితే సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణలు చెబుతా. నా జీవితం పాడైపోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ”ఐవీఎఫ్ ద్వారా తాను ఒక బిడ్డను కన్నానని భార్య శాంతినే స్వతహాగా చెప్పింది. విజయసాయికి పిల్లలు లేరు. ఒక ఆడపిల్లను పెంచుకున్నారు. ఆయన పిల్లలు కావాలని నన్ను అడిగారు. విజయసాయిరెడ్డి అంటే నాకు ఇష్టం. నేనంటే ఆయనకు ఇష్టం. బాబు కావాలని అడిగారు. అందుకే బేబీని కనిపెట్టాను అని శాంతి చెప్పింది అంటూ మదన్ వాపోయారు. మరి మదన్ వ్యాఖ్యలతో మరోసారి ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Read Also : Vijayasai Reddy – Shanthi : విజయసాయి రెడ్డి కి పూనమ్ సపోర్ట్ ..?