Site icon HashtagU Telugu

Viral : టీడీపీ ఎమ్మెల్యే రాసలీలల బాగోతం

TDP suspended Satyavedu Mla Koneti Adimul

ఏపీలో మొన్నటి వరకు వైసీపీ నేతల (YCP Leaders) తాలూకా రాసలీలలకు (Romantic Videos) సంబదించిన వీడియోస్ బయటకు వచ్చి వైరల్ గా మారగా…ఇప్పుడు అధికార పార్టీకి సంబదించిన ఎమ్మెల్యే తాలూకా రొమాంటిక్ వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోస్ చూసిన వారంతా ఛీ కొడుతున్నారు. ఇలాంటి వారినా మనం పాలించే అధికారం ఇచ్చిందని మండిపడుతున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరా అని అనుకుంటున్నారా..? అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ లో చేరి విజయం సాధించిన కోనేటి ఆదిమూలం (Satyavedu MLA Koneti Adimulam).

We’re now on WhatsApp. Click to Join.

ఈ వీడియోలను స్వయంగా బాధిత మహిళే విడుదల చేయడం ఇప్పుడు మరింత చర్చ గా మారింది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన పైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ప్రైవేటు హోటల్లో సదరు ఎమ్మెల్యే..మహిళతో ఏకంతంగా గడుపుతున్నట్లు ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. తన ప్రాణానికి హాని ఉందంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాసింది బాధితురాలు. అర్థరాత్రి వేళ వీడియో కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారని, తన ఇంట్లో గొడవలు తీవ్రమైనట్లు చెప్పింది. ఇప్పుడు తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు గోడు వెల్లబోసుకుంది.

రాసలీలల వీడియోపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రియాక్ట్ అయ్యారు. ఆ వీడియోతో తనకు సంబంధం లేదని, మార్ఫింగ్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తంచేశారు. ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసే తనపై కుట్ర చేశారని ఆరోపించారు. మరి దీనిపై టీడీపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. గతంలో వైసీపీ నేతల తాలూకా వీడియోస్ బయటకు వచ్చినప్పుడు టీడీపీ నేతలు నానా రభస చేసారు. మరి ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యే కు సంబదించిన వీడియో బయటకు వచ్చింది. దీనిపై ఏమంటారని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.

Read Also : Car Offers: హోండా కార్లపై కళ్ళు చెదిరే ఆఫర్స్.. ఏకంగా అన్ని లక్షల తగ్గింపు!