ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడంతో భారీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. గత ప్రభుత్వం తీరు వల్ల రాష్ట్రం వైపు చూడని సంస్థలు..ఇప్పుడు ఒకదాని తరువాత ఒకటి వరుసగా భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నాయి. మరోపక్క ఐటీ మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) సైతం తనదైన మార్క్ చూపిస్తూ సంస్థలను ఆకర్షిస్తున్నారు. దీంతో రాష్ట్రానికి భారీ సంస్థలు క్యూ కడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాట్ల (Reliance Industries Biogas Plants) పనులు చకచకా జరుగుతుండడంతో ఇక ఈ జిల్లా రూపురేఖలు మారిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు. మొత్తం 4000 ఎకరాల బంజరు భూమిని లీజుకు ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమైంది.
Maruti Suzuki : ఎస్‌యూవీల యుగంలో ఆల్టో దుమ్ము రేపింది..!
కనిగిరి(Kanigiri)లో బయోగ్యాస్ ప్లాంట్ కోసం ప్రభుత్వ భూమికి ఎకరాకు రూ. 15,000, ప్రైవేట్ భూమికి రూ. 30,000 చొప్పున లీజు కౌలు చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఒప్పందం ఇటీవల ఏపీ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రాంతానికి ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా ఆర్థిక వృద్ధి సాధించబడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏపీ ప్రభుత్వంతో కలసి రాష్ట్రవ్యాప్తంగా 500 బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 65,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి వస్తాయి. 8 జిల్లాల్లో చేపట్టబోయే ఈ ప్లాంట్ల నిర్మాణం ద్వారా సుమారు రెండున్నర లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
AP Free Bus Scheme: మహిళలకు ఉచిత బస్సు పథకం.. కర్ణాటకలో ఏపీ మంత్రుల పర్యటన…
పైలట్ ప్రాజెక్టు కింద కాకినాడలో మూడు, రాజమండ్రిలో రెండు, కర్నూలు, నెల్లూరు, విజయవాడలో ఒక్కో ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశగా ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ఇందులో బీడు భూములను వినియోగించి ప్రత్యేక గడ్డిని పెంచి, దానివల్ల బయోగ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని జనవరి 8న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్‌గా చేయాలని యోచిస్తున్నారు. అయితే, కౌలు ఒప్పందాలు పూర్తి కాకపోతే ప్రారంభ వేడుక వాయిదా పడే అవకాశం ఉంది. రిలయన్స్ ప్రాజెక్టు విజయవంతమైతే ఆ జిల్లా అభివృద్ధి రూపురేఖలు మారుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.