Donations To Regional Parties : 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఎన్ని విరాళాలు వచ్చాయి ? విరాళాల సేకరణలో టాప్ ప్లేసులో నిలిచిన ప్రాంతీయ పార్టీలు ఏవి ? అనే వివరాలతో అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒక సంచలన నివేదికను రిలీజ్ చేసింది. అందులోని కీలక సమాచారాన్ని మనం ఈ కథనంలో చూద్దాం..
Also Read :Interpol Silver Notice : తొలిసారిగా ఇంటర్‌పోల్ ‘సిల్వర్ నోటీసులు’.. ఏమిటివి ? ఇంకెన్ని నోటీసులుంటాయ్ ?
ఏడీఆర్ నివేదిక ప్రకారం 2022-23లో ప్రాంతీయ పార్టీలకు విరాళాల వివరాలివీ..
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రాంతీయ పార్టీలకు రూ.200 కోట్లకుపైగా విరాళాలు వచ్చాయి.
- ఇందులో అత్యధికంగా రూ.154.03 కోట్ల విరాళాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి. ఇందులో రూ.138.97 కోట్లను 40 మంది కార్పొరేట్ దాతలు ఇచ్చారు. మొత్తం 47 మంది దాతల నుంచి బీఆర్ఎస్‌కు విరాళాలు సమకూరాయి.
- ఈ జాబితాలో రూ.16 కోట్ల విరాళాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో(Donations To Regional Parties) నిలిచింది. ఐదుగురు దాతల నుంచే ఈ చందాలు వచ్చాయి.
- టీడీపీకి రూ.11.92 కోట్ల విరాళాలు వచ్చాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం(2021-2022)తో పోలిస్తే టీడీపీకి 1,795 శాతం మేర విరాళాలు పెరిగాయి.
- ప్రాంతీయ పార్టీలకు వచ్చిన మొత్తం రూ.200 కోట్ల విరాళాల్లో 90.56 శాతం బీఆర్ఎస్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, డీఎంకేలకే దక్కడం విశేషం.
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో తమకు విరాళాలు అస్సలు రాలేదని బిజూ జనతాదళ్(బీజేడీ), జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తెలిపాయి.
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో సమాజ్‌వాదీ పార్టీ విరాళాలు 99.1 శాతం, శిరోమణి అకాలీ దళ్ విరాళాలు 89.1 శాతం తగ్గాయి.
- 57 ప్రాంతీయ పార్టీలకుగానూ 18 పార్టీలే తమ విరాళాల సమగ్ర సమాచారాన్ని నిర్దిష్ట గడువులోగా ఈసీకి అందించాయి.
- దాతల పాన్‌కార్డుల సమాచారాన్ని ఇవ్వకుండానే రూ.96.2 లక్షల విరాళాలను పొందినట్లు ఐదు రీజియనల్ పార్టీలు అనౌన్స్ చేశాయి.
- రూ.3.36 కోట్ల విరాళాలను అందించిన దాతల చిరునామా వివరాలను పలు ప్రాంతీయ పార్టీలు వెల్లడించలేదు.