YS Jagan : ఏపీపై `రెడ్` నోటీస్.. గ‌వ‌ర్న‌ర్ పాల‌న దిశ‌గా ..?

అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు ప్ర‌భుత్వాలు ఏవైనా అప్పులు చేయ‌డం స‌హ‌జం. వాటిని స‌క్ర‌మంగా వినియోగించ‌డం, స‌కాలంలో చెల్లించే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు.

  • Written By:
  • Updated On - November 14, 2021 / 01:01 AM IST

అమెరికా నుంచి ఆంధ్రా వ‌ర‌కు ప్ర‌భుత్వాలు ఏవైనా అప్పులు చేయ‌డం స‌హ‌జం. వాటిని స‌క్ర‌మంగా వినియోగించ‌డం, స‌కాలంలో చెల్లించే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. గుట్టు చ‌ప్పుడు కాకుండా ప‌రిపాల‌న సాగిపోతోంది. అందుకు భిన్నంగా జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్పుడు రోడ్డున ప‌డింది. కంపెనీలు రెడ్ నోటీసులు ఇవ్వ‌డంతో అబాసు పాలైయింది. జ‌గ‌న్ స‌ర్కార్ కే కాదు..ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి బ్లాక్ స్పాట్ గా తాజా ప‌రిణామం ఉంది.వైద్య ప‌రిక‌రాల‌ను అందించే కంపెనీలు సుమారు 500 వ‌ర‌కు ఉన్నాయ‌ని అంచ‌నా. వాట‌న్నింటికీ ఒక జాతీయ యూనియ‌న్ ఉంది. ప్ర‌భుత్వాలు తీసుకునే నిర్ణ‌యాలు, వాటి గుడ్ విల్ మీద యూనియ‌న్ చ‌ర్చించుకుంటోంది. ఆ విష‌యాల‌ను యూనియ‌న్ వెబ్ సైట్ లో పెడుతుంటారు. తాజాగా ఏపీ ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన బ‌కాయిల గురించి వెబ్ సైట్లో పొందుప‌ర‌చ‌డంతో పాటు, ఇక నుంచి ఏ కంపెనీ కూడా వైద్య ప‌రికరాల‌ను స‌ర‌ఫ‌రా చేయొద్ద‌ని రెడ్ నోటీసులు ఇచ్చింది.

Also Read : జ‌గ‌న్ పై లోకేష్ `యంగ్ త‌రంగ్ `

నోటీసుల‌కు భిన్నంగా ఏ కంపెనీ అయినా ప్ర‌భుత్వానికి ప‌రిక‌రాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తే యూనియ‌న్ బాధ్య‌త వ‌హించ‌ద‌ని చెప్పేసింది. ఆయా రాష్ట్రాలు పెట్టే ప్ర‌తిపాద‌నల‌ మేర‌కు వైద్య ప‌రిక‌రాల‌ను దేశ‌, విదేశాల్లోని కంపెనీలు స‌ర‌ఫ‌రా చేస్తుంటాయి. ముందుగా డ‌బ్బు చెల్లించ‌న‌ప్ప‌టికీ ఆయా ప్ర‌భుత్వాల మీద ఉండే న‌మ్మ‌కంతో ప‌రిక‌రాల‌ను ఇస్తుంటాయి. ఆ విధంగా స‌ర‌ఫ‌రా చేసిన ప‌రిక‌రాల రూపంలో ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఆయా కంపెనీల‌కు సుమారు 10వేల కోట్ల రావాల‌ట‌. ఈ అప్పు గ‌త నాలుగేళ్లుగా బకాయిల రూపంలో పేరుకుపోయింద‌ని కంపెనీలు చెబుతున్నాయి.ఏపీ స‌ర్కార్ నిబంధ‌న‌ల‌కు మించిన అప్పులు చేసింది. ఆర్బీఐ విధించే ఎఫ్ ఆర్ బీఎం నిబంధ‌న‌ల‌ను ఎప్పుడో తాటేసింది. పీడీ అకౌంట్లు అన్నీ ఖాళీ గా ఉన్నాయి. అప్పులు ఇవ్వ‌డానికి ఎవ‌రూ ముందుకు రావడంలేదు. అప్పుల తీసుకోవ‌డానికి కేంద్రం నుంచి ప్ర‌త్యేక అనుమ‌తులు కోసం ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం శూన్యం. చంద్ర‌బాబు హ‌యాంలో చేసిన ఉపాథి హామీ ప‌నుల బ‌కాయిల సుమారు రూ. 20వేల కోట్లు ఇంకా చెల్లించ‌లేదు. వాటిని త‌క్ష‌ణం చెల్లించాల‌ని ఇటీవ‌ల హైకోర్టు ఆదేశించిన విష‌యం విదిత‌మే.

Also Read : ఏపీ ప్ర‌భుత్వానికి ఏపీ ఎల‌క్ట్రిసిటీ రెగ్యూలేట‌రీ క‌మిష‌న్ ఘాటు లేఖ

ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు, డీఏల స‌కాలం ఇవ్వ‌లేక, విడ‌త‌వారీగా జీతాల‌ను ఏపీ స‌ర్కార్ చెల్లిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగుల‌కు వివిధ రూపాల్లో ఇవ్వాల్సిన సుమారు 1300కోట్లు బ‌కాయిలు ఎప్పుడు చెల్లిస్తారో తెలియ‌దు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు టెండ‌ర్ల‌ను ఆహ్వానిస్తే, వాటి కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌డానికి ఎవ‌రూ ముందుకు రాలేదు. ప్ర‌భుత్వానికి సంబంధించిన ఏ ప‌ని చేయాల‌న్నా..ప్రైవేటు కాంట్రాక్ట‌ర్లు అవ‌స‌రం. కానీ, జ‌గ‌న్ స‌ర్కార్ ప‌నులంట‌నే భ‌య‌ప‌డి పోతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేయించిన ప‌నుల‌కు సైతం డ‌బ్బు ఇవ్వ‌లేపోతోంది. కాంట్రాక్ట‌ర్లు ఆఫీసుల చుట్టూ తిరుగడం మిన‌హా ఎలాంటి ప్ర‌యోజ‌నం లేదు.న‌వ‌ర‌త్నాల‌ను అమలు చేయ‌డానికి డ‌బ్బు లేక‌పోవ‌డంతో వాయిదా వేస్తున్నారు. ఫించ‌న్ల‌ను ప్ర‌తి ఏడాది పెంచుతామ‌ని చెప్పిన హామీని అట‌కెక్కించారు. అమ్మ ఒడికి గండి పెట్టారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను నిర్వ‌హించడానికి ఏ రోజుకారోజు వ‌చ్చే నిధులు చాల‌వు. పైగా ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డానికి రాబ‌డి స‌రిపోవ‌డంలేదు. ఇదంతా జగ‌న్ ప్ర‌భుత్వాన్ని ఉక్కిబిక్కిరి చేస్తోంది. చంద్ర‌బాబు దిగిపోయేనాటికి రాష్ట్రం అప్పులు సుమారు 3.5లక్ష‌ల కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ అప్పు 4.50ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. తీసుకున్న అప్పుకు వ‌డ్డీ రూపంలో ఏడాదికి రూ. 30వేల కోట్ల వ‌ర‌కు చెల్లించాల్సిన దుస్థితి ఏపీ ప్ర‌భుత్వానికి ఉంద‌ని ఆర్థిక వేత్త‌లు చెబుతున్నారు.

Also Read : నాడు మండలి ర‌ద్దు అన్నారు..నేడు వారికి అదే దిక్క‌వుతుందా…?

ఆర్థిక ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలని ప్ర‌త్య‌ర్థి పార్టీలు కోరుతున్నాయి. ఆ దిశ‌గా కాగ్ కూడా సంకేతాలు ఇస్తోంది. అప్పుల‌ను కూడా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తీసుకొచ్చార‌ని ఇటీవ‌ల పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ బ‌య‌ట‌పెట్టాడు. తాజాగా రెడ్ నోటీసును కంపెనీల నుంచి జ‌గ‌న్ స‌ర్కార్ అందుకుంది. మిగిలిన కంపెనీలు కూడా ఇలాగే చేస్తే, రాబోవు రోజుల్లో గ‌వ‌ర్న‌ర్ పాల‌న అనివార్య‌మ‌ని ఆర్థిక‌వేత్త‌లు అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్ప‌ట్లో ఏపీ గ‌ట్టేక్కే ప‌రిస్థితి లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.