Site icon HashtagU Telugu

BJP : నాగబాబు రుణం తీర్చుకోబోతున్న బిజెపి..?

nagababu minister post

nagababu minister post

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) తాజాగా రాజ్యసభ సీటు (Rajya Sabha Seat) భర్తీపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా (YSRCP MP Vijayasai Reddy Resigns) చేసిన తర్వాత ఖాళీ అయిన ఈ స్థానం కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. మొదట్లో ఈ సీటు బీజేపీకి కేటాయిస్తారని, ముఖ్యంగా మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చే అవకాశముందని ఊహాగానాలు వినిపించాయి. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఈ సీటు ఇవ్వాలనే ప్రతిపాదన ఉన్నట్లు వార్తలు వచ్చినా, ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రానని స్పష్టంగా చెప్పడంతో ఆ అవకాశం తీరిపోయింది. అయితే, ఇప్పుడు ఈ సీటును జనసేన అభ్యర్థికి కేటాయించాలని బీజేపీ కూటమి మిత్రులు ఒత్తిడి తెస్తున్నారు.

MLC Elections: మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోల్స్.. కాంగ్రెస్‌లో భారీ పోటీ

జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిలో భాగంగా జనసేన ఇప్పటికే అనకాపల్లి ఎంపీ సీటును బీజేపీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు తగిన ప్రతిఫలంగా బీజేపీ ఈ రాజ్యసభ సీటును కేటాయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన తరఫున మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఈ సీటును ఆశిస్తున్నట్లు సమాచారం. రాజకీయంగా నాగబాబు బలమైన నేతగా ఎదిగేందుకు రాజ్యసభ సభ్యత్వం ఉపయుక్తంగా ఉంటుందని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు మంత్రివర్గంలో నాగబాబుకు చోటు కల్పించాలనే ప్రయత్నం జరిగినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటైన మరికొంత సమయం మాత్రమే కావడంతో కేబినెట్ విస్తరణ మరింత ఆలస్యం కావొచ్చని అంటున్నారు.

Jagan No Comments : అరే..జగన్ నోటి వెంట పవన్ పేరు రాలేదే?

ఈ నేపథ్యంలో, బీజేపీ రాజ్యసభ సీటును నాగబాబుకు కేటాయించడం రాజకీయంగా కూటమికి లాభదాయకమని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల దృష్ట్యా జనసేనను మరింత మద్దతుగా మార్చుకోవడానికి ఇది బీజేపీకి ఓ మంచి వ్యూహాత్మక నిర్ణయంగా మారవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కోరుకుంటుండటం, రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశాన్ని కూడా బీజేపీ పరిగణనలోకి తీసుకోవచ్చు. మొత్తానికి, నాగబాబు రాజ్యసభకు వెళ్తారో లేదో ఇంకా స్పష్టత రాలేకపోయినా, బీజేపీ త్యాగం చేసి జనసేనకు అవకాశమిస్తుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.