Telugu States Alert : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్. ఈరోజు (ఏప్రిల్ 9) నుంచి ఏప్రిల్ 12 వరకు ఈ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడటంతో పాటు పిడుగుపాట్లు సంభవించే ముప్పు ఉంది. ప్రత్యేకించి ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల ప్రజలకు పిడుగుపాట్ల ముప్పు ఎక్కువగా ఉంది. అక్కడ బలమైన ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అంచనా. ఈమేరకు వివరాలతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది.
Also Read :Tahawwur Rana: రాత్రికల్లా భారత్‌కు ఉగ్రవాది తహవ్వుర్ రాణా.. ఇతడెవరు ?
దక్షిణాది రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతాలలో..
పిడుగుపాటు, బలమైన ఈదురుగాలుల వల్ల దక్షిణాది(Telugu States Alert) రాష్ట్రాల్లోని సముద్ర తీర ప్రాంతాలు ప్రభావితం అవుతాయని ఐఎండీ పేర్కొంది. ఏప్రిల్ 9 నుంచి 12 వరకు వర్షాలతో ప్రభావితమయ్యే జాబితాలో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కోస్తాంధ్ర, యానాం, కేరళ, మాహే, తెలంగాణ, కర్ణాటక ఉన్నాయని వెల్లడించింది. ఈరోజు బిహార్, జమ్మూకశ్మీర్‌లలో పలుచోట్ల వడగళ్ల వానలు పడొచ్చని అంచనా వేసింది.
Also Read :Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?
నేడు, రేపు, ఎల్లుండి..
ఏప్రిల్ 9, 10 తేదీల్లో అసోం, మేఘాలయలలో.. రేపు (ఏప్రిల్ 10) అరుణాచల్ ప్రదేశ్, వాయవ్య భారత దేశంలోని రాష్ట్రాల్లో .. ఈ రోజు నుంచి ఏప్రిల్ 11 వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో వర్షాలు పడొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక ఇదే సమయంలో గుజరాత్, రాజస్థాన్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వడగాలులు కొనసాగొచ్చని ఐఎండీ పేర్కొంది. నైరుతి, ఆగ్నేయ దిశల్లో ఉన్న అల్ప పీడనం రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వాయవ్యం, ఉత్తర దిశల వైపుగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.