ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో విమర్శలు గుప్పించే రఘురామకృష్ణంరాజు (RRR) తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి సంచలనంగా మారాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ పై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో అరెస్ట్ కు గురై, కస్టోడియల్ టార్చర్‌కు గురయ్యానని ఆరోపించిన రఘురామా.. ఇప్పుడు కూడా జగన్ పై పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల కుంభమేళా సందర్భంగా ఆయన పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవితో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. అదే సమయంలో పులివెందులలో ఉపఎన్నికలు రావాలని కోరుకుంటున్నట్లు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Tesla In India: భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ఎలాన్ మస్క్ టెస్లా?
పులివెందులలో ఉపఎన్నికలు వస్తే తానే ఇంచార్జ్ గా ఉంటానని రఘురామ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. గతంలో జగన్ అసెంబ్లీకి హాజరుకాకుంటే ఉపఎన్నికలు ఖాయమని వ్యాఖ్యానించిన RRR ఇప్పుడు కుంభమేళా సందర్భంలో అదే విషయాన్ని మరోసారి గుర్తుచేశారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయినా, రఘురామ మాత్రం ఇంకా జగన్‌ను వెంటాడుతూనే ఉన్నారనే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. టీడీపీ తరఫున పులివెందుల నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఆయన స్వయంగా ప్రకటించుకోవడం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో ఆందోళన రేపగా, టీడీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. పులివెందులలో టీడీపీకి ఇప్పటి వరకు పెద్దగా బలం లేనప్పటికీ, రఘురామకృష్ణంరాజు ప్రత్యక్షంగా రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు సవాల్‌గా మారతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.