వైసీపీ కి గట్టి బేస్ ఉన్న కడప (Kadapa) జిల్లాను, కూటమి పార్టీలన్నీ ఇప్పుడు రాజకీయంగా కీలకంగా భావిస్తున్నాయి. ఈ మధ్యనే తెలుగుదేశం పార్టీ మహానాడు సభను కడపలో ఘనంగా నిర్వహించి, అక్కడ తమ ప్రభావాన్ని చూపించింది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి కడపలో నిర్వహించిన ఈ సభ రాజకీయంగా పెద్ద రిసౌండ్ సృష్టించింది. దీనితో వైసీపీ గడ్డపై టీడీపీ తన బలాన్ని చాటింది. ఇప్పుడు అదే కడపలో మరో మిత్రపక్షం అయిన బీజేపీ కూడా రాజకీయ కార్యాచరణ ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.
Ben Stokes: ఆట మధ్యలోనే పెవిలియన్‌కు వెళ్లిపోయిన స్టోక్స్.. కారణం ఇదే?!
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పీవీఎన్ మాధవ్ (PVN Madav) తన తొలి రాష్ట్ర పర్యటనను కడప నుంచి ప్రారంభించబోతున్నారు. ఈ పర్యటనను “సారధ్యం” పేరుతో ఐదు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించనున్నట్లు మాధవ్ ప్రకటించారు. రాజకీయ కంటే ఆధ్యాత్మిక ప్రాతిపదికన కడపను ఎంచుకున్నట్లు మాధవ్ చెప్పారు. తెలుగు సంస్కృతికి తలుపులు తెరచిన జిల్లా, దేవుని తొలిగడపగా ఉన్న కడప నుంచి తన పర్యటనను మొదలు పెట్టడం గమనార్హం.
2024 ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీ భారీ ఓటమిని చవిచూసింది. జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలన్నీ అక్కడ సీట్లు గెలుచుకోవడంతో రాయలసీమ ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారింది. టీడీపీ గతంలో గెలవని సీట్లను కూడా ఈసారి సాధించగలగడం, పవన్ కళ్యాణ్ తరచూ సీమ జిల్లాల్లో పర్యటించడం, చంద్రబాబు రూటీనుగా రెండు సార్లు జిల్లాల్లో పర్యటనలు చేయడం వంటి చర్యలతో కూటమి పక్షాలు సీమపై పట్టుదలగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా అదే దారిలో నడుస్తుండటం వల్ల వైసీపీకి ఇది తీవ్రమైన సవాలుగా మారనుంది. రాయలసీమలో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడంలో వైసీపీకి ఈసారి ఎంతో శ్రమపడాల్సి వచ్చే అవకాశం ఉంది.