Ashok Gajapathi Raju: ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి ఉన్నారు. ఆయనను ఇంకొన్ని నెలల్లో మారుస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే.. మరో నేతకు తమిళనాడు గవర్నర్ పదవిని కేటాయించాల్సి ఉంటుంది. దక్షిణాదికి చెందిన నేతకే ఆ పోస్టును కేటాయించాలని కేంద్రంలోని ఎన్‌డీఏ సర్కారు భావిస్తోందట. తమ మిత్రపక్షం టీడీపీకి ఆ ఛాన్స్ ఇవ్వాలని చూస్తోందట. అంటే మన తెలుగు వ్యక్తి తమిళనాడు గవర్నర్ అవుతారు తద్వారా తమిళనాడులోని తెలుగు ప్రజానీకాన్ని ఈజీగా తమ వైపునకు తిప్పుకోవచ్చని బీజేపీ భావిస్తోందట.
Also Read :Tamannaah : చెప్పులు లేకుండా.. ఎండలో.. కాళ్లకు బొబ్బలు వచ్చినా.. సినిమా కోసం తమన్నా కష్టాలు..
యనమల, అశోక్ గజపతిరాజు పేర్లు..
ఈ తరుణంలో టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు(Ashok Gajapathi Raju) పేరు జోరుగా వినిపిస్తోంది. తమిళనాడు గవర్నర్ పోస్టుకు ఈయన పేరును చంద్రబాబు ప్రతిపాదిస్తారని తెలుస్తోంది. మంత్రి నారా లోకేశ్ కూడా అందుకు సానుకూలంగా ఉన్నారట. ఒకానొక దశలో మరో సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు పేరు కూడా చర్చకు వచ్చిందట. అయితే టీడీపీలోని ఓ కీలక వర్గం అందుకు నో చెప్పిందట. మొదటి నుంచీ అందరితో సమన్వయం చేసుకొని ముందుకుసాగుతున్న అశోక్ గజపతిరాజే గవర్నర్ పదవికి సరైన వ్యక్తి అని నిర్ణయించారట.
Also Read :Allu Arjun : పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్.. ఆ సంఘటన తర్వాత మొదటిసారి..
బీజేపీ పెద్దలతోనూ సఖ్యత..
బీజేపీ పెద్దలతోనూ అశోక్ గజపతిరాజుకు మంచి పరిచయాలే ఉన్నాయి. ప్రధాని మోడీ తొలి కేబినెట్ లో అశోక్ పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో ఆయన పనితీరు ప్రధాని మోడీకి బాగా నచ్చిందట. అందుకే అశోక్ గజపతిరాజు పేరును చంద్రబాబు ప్రతిపాదిస్తే.. బీజేపీ పెద్దల నుంచి తిరస్కరణ ఎదురయ్యే అవకాశమే లేదు. మొత్తం మీద దీనిపై టీడీపీ వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటనేదీ విడుదల కాలేదు. వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డికి తమిళనాడు గవర్నర్ పదవి ఇస్తారనే ప్రచారం గతంలో జరిగింది. త్వరలోనే ఆయన బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరిన వెంటనే విజయసాయికి ఆ అవకాశాన్ని బీజేపీ పెద్దలు ఇవ్వకపోవచ్చు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్లను మాత్రమే అటువంటి కీలక పోస్టుల కోసం పరిగణిస్తారు.