Digital Panchayats : ఆంధ్రప్రదేశ్‌లోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను పేమెంట్స్ ఆన్‌లైన్ అయ్యాయి. రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న దాదాపు 88 లక్షల ఇళ్లు, దుకాణాలు, భవనాల సమగ్ర సమాచారాన్ని ‘స్వర్ణ పంచాయతీ’ పేరుతో ప్రత్యేక పోర్టల్‌లోకి తీసుకొచ్చారు. జనవరి నుంచి రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లు, భవనాల అసెస్‌మెంట్ నంబరును ప్రత్యేక పోర్టల్‌లో ఎంటర్ చేసి.. ఆస్తి పన్ను బకాయిల సమాచారాన్ని చూసుకొని ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయొచ్చు. ఆస్తిపన్ను వసూళ్ల కోసం 5వేల పెద్ద పంచాయతీల్లో పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులతోనూ బకాయిలు చెల్లించొచ్చు. కొన్ని గ్రామపంచాయతీల్లో క్యూఆర్ కోడ్‌తో పన్ను బకాయిలు కట్టొచ్చు. ప్రజల నుంచి వసూలుచేసే మొత్తాలు నేరుగా గ్రామ పంచాయతీల పీడీ ఖాతాల్లో జమ అవుతాయి. వ్యాపార లైసెన్సులు, భవన నిర్మాణ అనుమతులు, వివాహ, జనన, మరణ ధ్రువీకరణపత్రాల సేవలను కూడా ఆన్‌లైన్‌లోనే పొందొచ్చు.
Also Read :Hanumantha Rao : కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత రావు కారుపై రాళ్ల దాడి
జనవరి నుంచి ‘స్వర్ణ పంచాయతీ’ పోర్టల్ ప్రారంభం అవుతుంది. అయితే తొలిదశలో గ్రామ పంచాయతీల్లో ముఖ్యమైన సేవలు(Digital Panchayats) మాత్రమే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తాయి. ఈ సేవల జాబితాలో ఆస్తి విలువ ధ్రువీకరణ పత్రాలు, వ్యాపార లైసెన్సులు, జనన, మరణ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుకు నిరభ్యంతర ధ్రువీకరణపత్రాలు, భవన నిర్మాణ అనుమతులు ఉంటాయి. తదుపరిగా విడతలవారీగా మొత్తం 80 రకాల సేవలను స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో అందుబాటులో తీసుకొస్తారు. వాస్తవానికి గతంలో అధికారంలో ఉన్నప్పుడే ఈ పోర్టల్‌ను ప్రారంభించాలని టీడీపీ యోచించింది. దాని నిర్వహణ బాధ్యతలను అప్పట్లో నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్(ఎన్‌ఐసీ)కు అప్పగించారు. అయితే వైఎస్సార్ సీపీ సర్కారు ఏర్పడిన తర్వాత ఎన్‌ఐసీకి నిధుల కేటాయింపును ఆపేశారు. దీంతో ఈ పోర్టల్ నిర్వహణ ఆగిపోయింది.ఇప్పుడు మళ్లీ టీడీపీ సర్కారు రావడంతో స్వర్ణ పంచాయతీ పోర్టల్ నిర్వహణను రాష్ట్ర ఆర్థిక నిర్వహణ, సేవల సంస్థకు అప్పగించారు.