Site icon HashtagU Telugu

Markapuram : విద్యార్థినిపై కన్నేసిన అధ్యాపకుడు..ప్రవైట్ ఫొటోస్ చూపిస్తూ అత్యాచారం

Volunteer rapes 10th student

Volunteer rapes 10th student

సమాజంలో మంచి , చెడు చెప్పాల్సిన అధ్యాపకులే ..సమాజం తలదించుకునేలా తప్పుడు పనులు చేస్తూ ఉపాధ్యాయ వృత్తికే చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో మహిళలకు అసలు రక్షణ లేకుండా పోతుంది. ఇంటి నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చేవరకు కన్నవారికి ఆందోళనే. పోలీసులు , కోర్టులు , ఎన్ని చట్టాలు తీసుకొస్తున్న కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళా కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు. ఆఖరికి 5 ఏళ్ల లోపు పసిపిల్లలను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా మార్కాపురం (Markapuram )లో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని (Inter Student) ఫై కన్నేసిన అధ్యాపకుడు..ఆమె తాలూకా ప్రవైట్ ఫొటోస్ తీసి..వాటిని చూపిస్తూ భయపెట్టి అత్యాచారం (Rap) చేసాడు. ఆఖరికి ఆ యువతీ గర్భం దాల్చిన తర్వాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు.

వివరాల్లోకి వెళ్తే..

మార్కాపురం పట్టణానికి చెందిన ఓ విద్యార్థిని 2022లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ (Inter Student) చదవుతుంది. అక్కడ యర్రగొండపాలెం మండలం పాలుట్ల గ్రామానికి చెందిన గోవింద్‌ నాయక్‌ (Govind Naik) అనే వ్యక్తి అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అప్పటికే అతనికి వివాహమై ఓ కుమారుడు ఉన్నారు. ఇంటి వద్ద దించే నెపంతో విద్యార్థినిని ఓ రోజు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణ శివారులోకి తీసుకెళ్లి అక్కడ ఆమె అసభ్యకర చిత్రాలను ఫోన్లో ఫొటోస్ తీసాడు. అనంతరం వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో సదరు విద్యార్థిని ఇంటర్‌ రెండో ఏడాది ఆ కళాశాలలో కాకుండా మరో చోట చదివేందుకు వెళ్లిపోయింది. అయినప్పటికీ గోవింద్‌ నాయక్‌ తన వికృత చేష్టలు మానలేదు. ఆమె అసభ్య చిత్రాలు తన వద్ద ఉన్నాయని.. ఇతరులకు చూపుతానని బెదిరింపులకు గురిచేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలిసిన నిందితుడు గర్భ విచ్ఛిత్తి చేసుకోవాలని డిమాండ్‌ చేశాడు. ఆమె అంగీకరించక పోవడంతో దాడికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఆమెను వైద్యులు పరీక్షించారు. కడుపుపై దెబ్బలు తగలడంతో విద్యార్థిని ప్రాణాలకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి తలెత్తిందని.. గర్భ విచ్ఛిత్తి చేయాలని సూచించారు. చివరికి బాధితురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రైవేట్‌ అధ్యాపకుడిపై అత్యాచారం, పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also : Sreeleela : ధమాకా బ్యూటీ శ్రీలీల వెంటాడుతున్న అరుదైన వ్యాధి