Tirupati Laddu Row : ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ట్వీట్ మెగా అభిమానుల్లో , జనసేన శ్రేణుల్లో ఆగ్రహం నింపుతుంది. దేశ వ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం (Tirumala Laddu Controversy) ఫై చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. ఇక లడ్డు విషయంలో ఎవరైనా తప్పుగా మాట్లాడిన, హిందూ దేవుళ్ల ఫై సెటైర్లు వేసిన పవన్ విరుచుకపడుతున్నారు. బయటవారే కాదు చిత్రసీమ నటులను సైతం వదిలిపెట్టడం లేదు. తాజాగా ప్రకాష్ రాజ్ (Prakash Raj) , కార్తీ లకు సైతం హెచ్చరించాడు. దీంతో కార్తీ సారీ చెప్పాగా..ప్రకాష్ రాజ్ మాత్రం తన ట్వీట్ ను మరోసారి చదవాలని చెప్పి ఆగ్రహం నింపాడు.
నేను చెప్పింది ఏంటి.. మీరు అర్థం చేసుకుందేంటీ పవన్ కళ్యాణ్. మీరు తప్పుగా అపార్థం చేసుకొని తిప్పుతున్నది ఏంటని సెటైర్ లు వేశారు. ప్రస్తుతం తాను.. విదేశాల్లో షూటింగ్లో ఉన్నానని .. ఈనెల చివరను 30 తారీఖున వరకు వస్తానని .. ఆ తర్వాత ప్రతి మాటకు సమాధానం చెప్తానని … ఇంతలోపు వీలైతే నా ట్వీట్ ని మళ్లీ ఒకసారి చదివి అర్థం చేసుకోండని ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ట్వీట్ ఫై మెగా అభిమానులతో పాటు , జనసేన శ్రేణులు సైతం ఆగ్రహంగా ఉండడం..ఇప్పుడు మరో ట్వీట్ చేసి వారిలో ఆగ్రహాన్ని మరింత పెంచాడు ప్రకాష్.
‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో’ అని నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిందేనని నెటిజన్లు , అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ‘లడ్డూ మ్యాటర్ సెన్సిటివ్ టాపిక్’ అంటూ తమిళ హీరో కార్తీ చేసిన వ్యాఖ్యలపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేయగా..వెంటనే కార్తీ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. దీనికీ పవన్ కూడా రిప్లయ్ ఇచ్చాడు. దీనిని ఉద్దేశించే ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసాడని అంత మాట్లాడుకుంటున్నారు.
Read Also : Kodali Nani : ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని