PM Modi Mega Roadshow In VJD : వైసీపీకి దడ పుట్టించిన మోడీ రోడ్ షో…

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఈ రోడ్‌ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్‌ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు

Published By: HashtagU Telugu Desk
Pm Road Show

Pm Road Show

ఏపీ(AP)లో కూటమి ప్రచారం (Election Campaign ) చేస్తుందా…లేక విజయోత్సవ సంబరాలు (Success Celebrations) చేసుకుంటుందా అనేది అర్థంకావడం లేదు..ఆ రేంజ్లో కూటమి నేతలు ప్రచారం చేస్తుంది. ఎవ్వరు ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేస్తూ అధికార వైసీపీ అభ్యర్థులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పుడు ఓ లెక్క అన్నట్లు అధినేతలు చంద్రబాబు , పవన్ కళ్యాణ్ కు విజృభిస్తున్నారు. ఇక వీరికి ప్రధాని మోడీ సైతం జతకలవడంతో కూటమి శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. మొన్ననే రాజమండ్రి సభలో పాల్గొన్న మోడీ (Mega Roadshow In VJD)..ఈరోజు పీలేరు సభలో పాల్గొని ప్రజలకు మరింత భరోసా , నమ్మకం కలిగించారు.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ సేపటి క్రితం విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ షోలో మోడీ పాల్గొన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఈ రోడ్‌ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్‌ షో నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఒకే వాహనంలో ప్రధాని మోడీ , చంద్రబాబు , పవన్ కళ్యాలు ..ముగ్గురు మొనగాళ్లు మాదిరి రోడ్ షో చేస్తుంటే అభిమానులకు , కార్యకర్తల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. 5వేల మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాపిక్‌ ఆంక్షలు విధించారు. భారీఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన టైమ్‌లో కరెంట్ కోత ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.

Read Also : Shyamala Devi : జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తున్న ప్రభాస్ పెద్దమ్మ.. నరసాపురంలో గెలుపు పక్కా..

  Last Updated: 08 May 2024, 08:32 PM IST