వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని (Perni Nani) నాని తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కృష్ణా జిల్లాలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “రప్పా రప్పా నరికేస్తాం (Rappa Rappa Narikestham) అని అరవడం కాదు. పని చీకట్లో జరగాలి. రాత్రికి రాత్రే అంతా అయిపోవాలి. ఇప్పుడు తప్పుడు వేషాలు వేస్తున్న వారిని, రేపు మన ప్రభుత్వం వస్తే కరిచేయాలి. ఆ తర్వాత ఏమి జరిగిందో తెలియనట్టుగా పరామర్శించాలి” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Body Shivering : ఒక్కసారిగా బాడీ వణకడం, చల్లటి చెమటలు వచ్చి కులబడుతున్నారా? ఈ లక్షణాలకు కారణం ఇదే!
ఈ వ్యాఖ్యలు ప్రభుత్వంపై దాడులు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నాయని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నాయి. జగన్ గతంలో చేసిన ‘రప్పా రప్పా’ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు పేర్ని నాని అదే ధోరణిని కొనసాగిస్తున్నారని అంటున్నారు. వైసీపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వైసీపీ నేతలు ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కూటమి ప్రభుత్వ ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, శాంతియుత పాలనకు భంగం కలిగించేలా ఉన్నాయని విమర్శిస్తున్నారు. అవసరమైతే లీగల్‌గా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం తెలిపింది. వైసీపీ నేతల మాటలు మరింత రాజకీయ వివాదానికి దారితీయబోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అరే ఎన్నిసార్లు"రప్పా రప్పా నరికేస్తాం అని అరవటం కాదు.. చీకట్లో మొత్తం అయిపోవాలి.. తరువాత వెళ్లి ఎలా జరిగింది, ఏంటి అని పరామర్శించాలి…" – వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని #PerniNani #AndhraPradesh #YSRCongressParty #HashtagU pic.twitter.com/PjVbDExFeI
— Hashtag U (@HashtaguIn) July 12, 2025