జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ను కలిశారు. బుధువారం హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించినట్టు సమాచారం. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సమన్వయ కమిటీలు, ఉమ్మడి మేనిఫెస్టో (Manifesto ) కమిటీలను ఏర్పాటు చేశారు. సీట్ల పంపకాలు, ఏయే స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై కూడా స్వల్ప చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరి వీరి సమావేశంలో ఏ ఏ అంశాల గురించి మాట్లాడారనేది తెలియాల్సి ఉంది. రాబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు అధినేతలు కలుసుకుంటూ రాజకీయ అంశాల గురించి చర్చలు జరుపుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ..బిజెపి తో కలిసి బరిలో నిల్చుంది. ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయగా..ఒక్క స్థానంలో మినహా మిగతా అన్ని స్థానాల్లో కనీసం డిపాజిట్ కూడా రాబట్టుకోలేకపోయింది. కూకట్ పల్లి లో కాస్త 40 వేల ఓట్లు సాధించింది. ఈ క్రమంలో జనసేన ఫై వైసీపీ నేతలు విమర్శలు , సెటైర్లు చేస్తున్నారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి రాబోతుందని..పవన్ కళ్యాణ్ ను చూసేందుకే జనాలు వస్తారని..ఓటు వేసేందుకు ఎవ్వరు ముందుకు రారని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : First Honda electric motorcycle: త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.?
