Pawan Kalyan : జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?

Pawan Kalyan : ఇది పార్టీ అంతర్గతంగా కూడా జాతీయ స్థాయిలో విస్తరణకు ఉత్సాహం పెరుగుతోందని సూచిస్తోంది

Published By: HashtagU Telugu Desk
Pawan Janasena

Pawan Janasena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అతి త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి (National Politics) వెళ్లే అవకాశం ఉందని అర్ధం అవుతుంది. తాజాగా నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ సభ (Janasena Formation Day) లో ఆయన చేసిన వ్యాఖ్యలు గమనిస్తే అలాగే అనిపిస్తుంది. ముఖ్యంగా డీలిమిటేషన్, త్రిభాషా విధానం, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, గోద్రా మారణహోమం వంటి అంశాలపై పవన్ స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అంశాలను ప్రస్తావించడం ద్వారా ఆయన కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలకే పరిమితం కాకుండా దేశ స్థాయిలో తన పాలిటికల్ స్ట్రాటజీని విస్తరించేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

TG Assembly : రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ..వాటిని గౌరవించాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటీవల మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్ వెళ్లినప్పుడు, ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ స్టేట్స్లో ఆయనకు మంచి గుర్తింపు ఉండటమే కాకుండా, అక్కడి ప్రజలు, నాయకులు కూడా జనసేన నాయకుడిపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో విస్తరణకు మార్గాన్ని సుగమం చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనను ఇప్పటివరకు ఆంధ్ర, తెలంగాణకు మాత్రమే పరిమితం చేసినా, పవన్ దేశవ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందే విధంగా తన పార్టీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోంది.

Mamnoor Airport : నిజాం వర్సెస్ భారత సైన్యం.. మామునూరు ఎయిర్‌పోర్ట్ చారిత్రక విశేషాలు

జనసేన అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్, భవిష్యత్‌లో జాతీయ స్థాయిలో తన పాత్రను మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకోవచ్చు అని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది పార్టీ అంతర్గతంగా కూడా జాతీయ స్థాయిలో విస్తరణకు ఉత్సాహం పెరుగుతోందని సూచిస్తోంది. అయితే జాతీయ రాజకీయాల్లో జనసేనకి ఎంతవరకు స్థానం లభిస్తుందో చూడాలి.

  Last Updated: 15 Mar 2025, 02:18 PM IST