Ramoji Rao : రామోజీ గ్రూపు అధినేత రామోజీరావుకు సంబంధించిన సంస్మరణ సభను ఏపీ సర్కారు ఈ ఏడాది జూన్ 27న నిర్వహించింది. ఈ కార్యక్రమానికి విజయవాడలోని పెనమలూరు వేదికగా నిలిచింది. ఆ కార్యక్రమం కోసం ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది ? అనే వివరాలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ఈ సభ నిర్వహణకు సర్కారుకు రూ.4.28 కోట్లు(Ramoji Rao) ఖర్చు చేసిందని వెల్లడైంది. ఈవివరాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది.
Also Read :Dussehra Holidays : దసరా సెలవులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
ఆ కార్యక్రమానికి స్వయంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు పత్రికా రంగానికి, పర్యాటక రంగానికి రామోజీరావు అందించిన సేవల గురించి చంద్రబాబు వివరించారు. నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా నిజాలు చెప్పిన పాత్రికేయుడు రామోజీరావు అని ఆనాడు టీడీపీ అధినేత కొనియాడారు. ఆయన లేకపోవడం అనేది తెలుగుజాతికి తీరని లోటు అని తెలిపారు. త్వరలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే.. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి రామోజీరావు పేరు పెడతారని పలువురు అంటున్నారు. గుడివాడ ప్రాంతానికి కూడా రామోజీరావుపేరు పెట్టనున్నట్టు టీడీపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. టీడీపీ సర్కారు వీటిలో ఏ నిర్ణయాన్ని తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే ఏపీలో టీడీపీకి వెన్నెముక ఈనాడు, ఈటీవీ నిలుస్తున్నాయి. టీడీపీకి మద్దతుగా బలమైన వార్తాప్రచారాన్ని చేస్తున్నాయి. గుడివాడ నగరానికి `రామోజీ-గుడివాడ` అనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read :India China Border : మూడు రోజులు మంచులో చిక్కుకున్న సైనికులు.. ఏమైందంటే.. ?
అయితే రామోజీరావు సంస్మరణ సభ నిర్వహణకు 4.28 కోట్ల రూపాయలను ఏపీలోని టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేయడంపై వైఎస్సార్ సీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇన్ని కోట్ల రూపాయలతో కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తోంది. విలువైన ప్రజాధనాన్ని వ్యక్తులకు సంబంధించిన ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేయకూడదని సూచిస్తోంది. అయితే వైఎస్సార్ సీపీ శ్రేణుల వాదనతో టీడీపీ వర్గాలు విభేదిస్తున్నాయి. తెలుగు జాతికి ఎంతో పేరు తెచ్చిన మహనీయులను ప్రత్యేక కార్యక్రమం ద్వారా స్మరించుకోవడం చాలా మంచి విషయమని అంటున్నారు.