No Rule of Law : అవినాష్ కు ఒక రూల్ చంద్ర‌బాబుకు మ‌రో రూల్

No Rule of Law : `అధికారంలో ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి మ‌రో న్యాయం. సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దోడికి మ‌రో న్యాయం

  • Written By:
  • Publish Date - September 9, 2023 / 01:25 PM IST

No Rule of Law : `అధికారంలో ఉన్నోడికి ఒక న్యాయం, లేనోడికి మ‌రో న్యాయం. సామాన్యుడికి ఒక న్యాయం, పెద్దోడికి మ‌రో న్యాయం, అయినోడికి ఒక న్యాయం, కానోడికి మ‌రో న్యాయం..`ఇదీ ఏపీలోని లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితి. ఆ రాష్ట్రంలో `రూల్ ఆఫ్ లా` లేద‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయిన తొలి రోజుల్లోనే ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన హైకోర్టు జ‌డ్జి రాకేష్ చెప్పారు. ఆ విష‌యాన్ని సుప్రీం కోర్టుకు కూడా తెలియ‌చేశారు. అయిన‌ప్ప‌టికీ పరిస్థితిలో మార్పు లేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇష్టానుసారం `నా పాల‌న నా ఇష్టం` అనేలా ఉంది. దానికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ చంద్ర‌బాబు అరెస్ట్ ఎపిసోడ్‌ను తీసుకోవ‌చ్చు.

`నా పాల‌న నా ఇష్టం` అనేలా (No Rule of Law )

స్కిల్ డ‌వ‌లెప్మెంట్ కేసులో చంద్ర‌బాబును (No Rule of Law) నిందితునిగా సీఐడీ చేర్చింది. ఆ మేర‌కు ఏ 37గా న‌మోదు చేసింది. ప‌లువుర్ని విచారించిన ఆ సంస్థ ఎఫ్ ఐఆర్ ను త‌యారు చేసింది. కానీ, చంద్ర‌బాబు పేరు మాత్రం దానిలో లేదు. కానీ, రిమాండ్ రిపోర్ట్ లో చేర్చామ‌ని ఆయ‌న్ను అరెస్ట్ చేసిన త‌రువాత చెబుతోంది. వాస్తంగా ఎవ‌ర్ని అరెస్ట్ చేయాల‌న్నా, ముందుగా నోటీసులు ఇష్యూ చేయాలి. అదేమీ లేకుండా చంద్ర‌బాబు వ‌ద్ద‌కు సీఐడీ పోలీస్ అర్థ‌రాత్రి వెళ్లింది. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌తో బ‌స చేసిన ఆయ‌న బ‌స్సును త‌ట్టింది. ఆ టైంలో ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డానికి సాహ‌సం చేసింది. కానీ, ఎస్పీజీ ర‌క్షణ లో ఉన్న ఆయ‌న్ను తాక‌డానికి లేద‌ని రూల్ ఉంది. అందుకే, సూర్యోద‌యం అయ్యే వ‌ర‌కు వేచిచూసి అరెస్ట్ చేసింది.

ఆధారాలున్న మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి కేసు

హెలికాప్ట‌ర్లో ఆయ‌న్ను త‌ర‌లించ‌డానికి అభ్య‌ర్థించింది. కానీ, చంద్ర‌బాబు అంగీక‌రించలేద‌ని చెబుతోంది. హుందాగా సీఐడీ పోలీస్ వ్య‌వ‌స్థ‌కు చంద్ర‌బాబు స‌హ‌క‌రించారు. కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌డానికి ఆయ‌న్ను సీఐడీ విజ‌య‌వాడ‌కు త‌ర‌లించింది. అధికారంలో లేని చంద్ర‌బాబును ఎలా అరెస్ట్ చేశారు? అనేది ఏపీ స‌మాజం చూసి నివ్వెర‌పోయింది. ఆయ‌న ప‌ట్ల సానుభూతితో చూస్తోంది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ మాత్రం ఆయ‌న్ను (No Rule of Law) దోషిగా తేల్చేస్తోంది. ఆ మేర‌కు ఆధారం మాత్రం చూప‌లేక‌పోతోంది. ఎవ‌రో చెప్పిన వాగ్మూలాన్ని బేస్ చేసుకుని చంద్ర‌బాబును అరెస్ట్ చేసింది. ఆ కేసును ఎలా నిరూపిస్తార్న‌ది పెద్ద ప్ర‌శ్న‌.

Also Read : TDP Loyalty : చంద్ర‌బాబు నిప్పంటూ కేశినేని స‌ర్టిఫికేట్

ఇక అన్నీ ఆధారాలున్న మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి కేసును తీసుకుందాం. సాక్షాత్తు కేంద్రం ప‌రిధిలో పనిచేసే సీబీఐ క‌ర్నూలు కేంద్రంగా వ్య‌వ‌హ‌రించిన తీరును గుర్తు చేసుకోవ‌చ్చు. సుప్రీం కోర్టు ఆదేశాల‌తో సీబీఐ ఆ కేసు విచార‌ణ‌ను వేగ‌వంతం చేసింది. అన్ని ఆధారాల‌తో ఎంపీ అవినాష్ తండ్రి భాస్క‌ర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. హ‌త్య‌కు సుత్ర‌ధారిగా భాస్క‌ర్ రెడ్డిని భావిస్తూ పాత్ర‌ధారిగా అవినాష్ రెడ్డి ఉన్నార‌ని అనుమానించింది. ఆ మేర‌కు రిమాండ్ ను త‌యారు చేసింది. అరెస్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం చేసింది. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం స‌హ‌క‌రించలేదు. దీంతో క‌ర్నూలు నుంచి తోక‌ముడుచుకుని సీబీఐ వెనక్కు వ‌చ్చింది. ఆ త‌రువాత ఎవ‌రికీ తెలియ‌కుండా సైలెంట్ గా ఆన్ పేప‌ర్ అరెస్ట్  (No Rule of Law)చూపించింది.

Also Read : CBN ARREST : నా అరెస్టు వెనుక పెద్ద కుట్ర : చంద్రబాబు

ప్ర‌ధాని మోడీ ఆధ్వ‌ర్యంలోని కేంద్రం ప‌రిధిలోని సీబీఐ కూడా లేని ప‌వ‌ర్ ఏపీ సీఐడీకి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చేశారు. ఎప్పుడు ఎవ‌రింటి మీద‌కు సీఐడీ పోలీస్ వ‌స్తుంది? అనేది తెలియ‌దు. వ‌చ్చిన వాళ్లు పోలీస్ లేదా ప్రైవేటు వ్య‌క్తులా? అనేది నిర్థారించుకోక‌ముందే యూ ఆర్ అండ‌ర్ అరెస్ట్ అంటూ అర్థ‌రాత్రుళ్లు చాలా మందిని ఇంటి నుంచి తీసుకెళ్లిన సంద‌ర్భాలు అనేకం. ఇప్పుడు చంద్ర‌బాబు విష‌యంలోనూ అదే త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించింది. కేసు మెరిట్స్ డీ మెరిట్స్ ను ప‌క్క‌న పెడితే, చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన తీరు మాత్రం అభ్యంత‌రక‌రం.