టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam ) నేటితో 200 వ రోజు (Yuvagalam 200 days)కు చేరుకుంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన లోకేష్ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. వైసీపీ (YCP) ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిన ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ లోకేష్ యాత్ర (Lokesh Padayatra ) కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ కు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు (Chandrababu) శుభాకాంక్షలు తెలియజేశారు.
యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2710 కిలోమీటర్ల మేర లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. మొత్తం 185 మండలాలు, మున్సిపాలిటీలు, 1675 గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర చేశారు. రోజుకు సగటున 13.5కి.మీ మేర పాదయాత్ర సాగుతోంది. యువగళం ద్వారా 64 బహిరంగసభలు, 132 ముఖాముఖి సమావేశాలు, 8 రచ్చబండ, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో యువనేత పాల్గొన్నారు. రాయలసీమలో 124 రోజుల పాటు 44 అసెంబ్లీ నియోజకర్గాల మీదుగా 1587 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది.
Read Also : Adani Group: అదానీ గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు.. మరోసారి భారీగా ఆస్తి నష్టం..!
లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra ) అనగానే వైసీపీ నేతలు (YCP Leaders) ఎద్దేవా చేసారు.10 కిమీ లైన లోకేష్ నడుస్తాడా..? మధ్యలోనే ఆపేస్తాడా..? అసలు లోకేష్ కు అంత సీన్ ఉందా..? అంటూ ఎవరికీ వారు ఇష్టానుసారంగా కామెంట్స్ , విమర్శలు చేసారు. కానీ అందర్నీ అంచనాలు తలదన్నేలా యాత్ర కొనసాగిస్తున్నారు. పది రోజులైనా నడుస్తాడా..? అన్నవారి నోర్లు మోసుకునేలా 200 వ రోజు కు చేరుకున్నాడు. 10 కిమీ కూడా నడవలేడు అని ఎద్దేవా చేసిన వారికీ 2710 కిలోమీటర్ల మేర నడిచి నారా వారి సత్తా ఇదిరా అని నిరూపించాడు.
తెలుగు నాట ఎంతోమంది పాదయాత్రలు చేశారు. దివగంత నేత రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, వైస్ షర్మిల, సీఎం జగన్ ఇలా అందరూ పాదయాత్ర చేసినవారే. అయినా ఎవరికి వారుగా తమ ముద్ర వేసుకున్నారు. ఈ తరుణంలో పాదయాత్రకు దిగిన లోకేష్ ఫై మొదట్లో ఎన్నో సెటైర్లు పడ్డాయి. కానీ ఆయన అదరలేదు బెదరలేదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు సాగుతూనే ఉన్నారు. విపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర వారానికి ఐదు రోజులు మాత్రమే సాగేది. ఒకరోజు కోర్టుకు, మరో రోజు విశ్రాంతికి.. మధ్యలో కాళ్ల బొబ్బల కథలు, వాటికి వైద్యులు చేస్తున్న ట్రీట్మెంట్ల ఇలా పాయాత్ర సాగింది. కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ యాత్ర కొనసాగుతోంది. నిర్విరామంగా ముందుకు కదులుతోంది. అసలు పాదయాత్ర చేయలేడు అన్న లోకేష్.. 2700 కిలోమీటర్ల నడిచి చూపించారు. అసలు మాట్లాడడం రాదన్న లోకేష్ ఘాటైన ప్రసంగాలతో అధికార పార్టీ పార్టీ నేతలకు చెమటలు పట్టిస్తూ వస్తున్నాడు.
Read Also : Modi : మోదీకి 80 శాతం ఆమోదం.. మరి విపక్షాల మాటేమిటి?
ప్రస్తుతం యువగళం పాదయాత్ర పోలవరం (Polavaram) నియోజకవర్గం సీతంపేట వద్ద 200వ రోజున 2700 కి.మీ.ల మైలురాయిని చేరుకుంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం నుంచి 200వ రోజు యువగళం పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు. పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సంఘీభావంగా పాదయాత్రలో నారా భువనేశ్వరి, నందమూరి, నారా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.