తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth )కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతుల(NTR Ghat Repairs) కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.35 కోట్ల నిధులు మంజూరు చేయడం పట్ల లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఘాట్ అభివృద్ధికి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం అని పేర్కొంటూ, ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు.
Data Breach : 16 బిలియన్ పాస్‌వర్డ్లు లీక్..! మీ ఖాతా కూడా ఉందా.. ఇలా తెలుసుకోండి..!
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను లోకేశ్ ప్రశంసించారు. ఎన్టీఆర్ ఘాట్ విశ్వవిఖ్యాత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్మారక స్థలం కావడంతో, ఇది తెలుగు ప్రజల సంస్కృతి, గౌరవానికి ప్రతీకగా ఉందన్నారు. హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో రూ.1.35 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి పనులు ఘాట్‌కు మరింత శోభను చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Suparipalanalo Toli Adugu : గెలిచింది కూటమి కాదు ప్రజలు – నారా లోకేష్
తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా ఎన్టీఆర్ ఘాట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, తెలుగు మహానాయకుడి సేవలను గౌరవించడంగా భావించాలన్నారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలకు దోహదం చేసే చర్యగా మారుతుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, “తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే దిశగా మీరు తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య సౌహార్దతను పెంపొందించేందుకు మార్గం చూపుతుంది” అని అన్నారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదం..తెలుగు జాతి వెలుగు సంతకం.. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహా నాయకుడు ఎన్టీఆర్ స్మృతివనం అయిన ఎన్టీఆర్ ఘాట్‌కు రూ.1.35 కోట్ల వ్యయంతో హెచ్ఎండిఏ మరమ్మతులు చేపట్టడం చాలా సంతోషం. ఎన్టీఆర్ ఘాట్ మరమ్మతులకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వానికి,… pic.twitter.com/5xf4iMzQGS
— Lokesh Nara (@naralokesh) June 23, 2025