Site icon HashtagU Telugu

Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

Nara Lokesh

Nara Lokesh

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇందుకోసం మంత్రి లోకేశ్ ఈరోజు రాత్రే ఢిల్లీకి ప్రయాణం కానున్నారు. ప్రధానితో భేటీ అనంతరం వెంటనే తిరిగి రాష్ట్రానికి చేరుకుని, అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇక జీఎస్టీ రేట్ల తగ్గింపుపై మంత్రి లోకేశ్ స్పందించారు. ఇప్పటివరకు అమలులో ఉన్న నాలుగు పన్ను శ్లాబులను రెండు మాత్రమే ఉంచడం, ముఖ్యంగా నిత్యావసర వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడం వృద్ధికి తోడ్పడే చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అభిప్రాయపడ్డారు.

Northern Turkey : జలప్రవేశం చేసిన కొన్ని నిమిషాల్లోనే మునిగిన లగ్జరీ నౌక: తుర్కియేలో ఉద్రిక్తత

దేశ పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసే సంస్కరణగా దీన్ని స్వాగతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా, విద్యార్థులకు అవసరమైన పెన్సిళ్లు, షార్ప్‌నర్‌లు, ఎక్సర్‌సైజ్ బుక్స్, మ్యాపులు, చార్టుల వంటి వస్తువులపై జీఎస్టీ తగ్గించడం ఎంతో శుభపరిణామమని ఆయన అన్నారు. ఇది విద్యార్థుల తల్లిదండ్రులకు ఊరటనిచ్చే నిర్ణయమని, విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని లోకేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి సరళమైన, వృద్ధికి అనుకూలమైన పన్ను విధానాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధాని మోదీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!