ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ వైసీపీ (YCP) కి వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. పార్టీ టికెట్ దక్కని నేతలంతా వరుస పెట్టి పార్టీ కి గుడ్ బై చెపుతూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి , జనసేన , టిడిపి లలో చేరగా..మరికొంతమంది ఇదే బాటలో కొనసాగుతున్నారు. తాజాగా నెల్లూరుకి చెందిన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) అతి త్వరలో వైసీపీని వీడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈసారి నెల్లూరు ఎంపీ (MP) అభ్యర్థిగా అధిష్టానం ఆయనను ప్రకటించింది. అయితే తన లోక్సభ పరిధిలోకి వచ్చే కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలని ఆయన కోరినా అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే వేమిరెడ్డిని మాజీ మంత్రి నారాయణ, టీడీపీ నేతలు కలిశారు. దీంతో ఆయన టిడిపి తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం నడుస్తుంది.
నెల్లూరు జిల్లాలో తన అనుచర వర్గం, సన్నిహితులతో ఈరోజు భేటీ ఏర్పాటు చేసారు. వైసీపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను వివరించారు. అయితే ఆయన కార్యవర్గం మాత్రం సీఎం జగన్ తో చర్చించిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వేమిరెడ్డి మాత్రం అందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది. పార్టీ మార్పు పైన సన్నిహితుల నుంచి పునరాలోచన చేయాలనే సూచన వచ్చినప్పటికీ, ఆయన మాత్రం టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని దగ్గరి సన్నిహితులు చెబుతున్నారు. వేమిరెడ్డి పార్టీకి, ఆయన సతీమణి ప్రశాంతి టీటీడీ బోర్డుకు రాజీనామా చేస్తారని ప్రచారం సాగుతోంది. మరి వేమిరెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.
Read Also : AP DSC 2024 : ఎస్‌జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు.. అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే