Site icon HashtagU Telugu

Missile Testing Center: ఏపీ‌లో మిస్సైల్ టెస్టింగ్ సెంటర్.. ఎక్కడో తెలుసా ?

Missile Testing Center Gullalamoda Andhra Pradesh Ap

Missile Testing Center: ఇప్పటికే ఏపీలోని శ్రీహరికోటలో ఇస్రో అంతరిక్ష కేంద్రం ఉంది. విశాఖపట్నంలో భారత నౌకాదళం తూర్పు కమాండ్ ఉంది. త్వరలో మిస్సైల్ టెస్టింగ్ కేంద్రం కూడా ఏపీలో ఏర్పాటు కానుంది.

Also Read :BRS Silver Jubilee: బీఆర్ఎస్‌కు మరో షాక్.. రజతోత్సవ సభకు అనుమతి డౌటే ?

చంద్రబాబు హయాంలోనే చకచకా.. 

కృష్ణా జిల్లా నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామంలో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌(Missile Testing Center) ఏర్పాటు కానుంది. ఇందుకు కేంద్ర సర్కారు సైతం పచ్చజెండా ఊపింది. ఈ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉంది. గుల్లల మోద చుట్టుపక్కల 6 నుంచి 8 కిలోమీటర్ల మేర ఎలాంటి జనావాసాలు లేవు. అందుకే మిస్సైల్ టెస్టింగ్‌‌కు దీన్ని ఎంచుకున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2011లోనే ఏపీకి మంజూరైంది. అప్పుడే ఈ ప్రాజెక్టుకు భూమిని కేటాయించాలని డీఆర్‌డీవో అధికారులు కోరగా,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో మిస్సైల్ పరీక్షా కేంద్రం ఏర్పాటులో జాప్యం జరిగింది.  2017లో ఈ ప్రాజెక్టుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం 300 ఎకరాలకుపైగా భూమిని డీఆర్‌డీవోకు కేటాయించింది. అప్పట్లో ఏటిమొగ రెవెన్యూ గ్రామ పరిధిలోని అభయారణ్యంలో 381.61 ఎకరాలను డీఆర్‌డీవోకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దీనికి బదులుగా గణపేశ్వరం పరిధిలోని అంతే రెవెన్యూ భూమిని అటవీ శాఖకు అప్పగించారు. పర్యావరణ అనుమతులు, ఇతర అడ్డంకుల కారణంగా కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టులో జాప్యం జరిగింది.

Also Read :KTR Open Letter : ‘‘వాళ్లది రియల్ ఎస్టేట్ మనస్తత్వం’’.. కేటీఆర్ బహిరంగ లేఖ

ప్రధాని మోడీయే వచ్చి.. 

2019లో కేంద్ర పర్యావరణ శాఖ నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. 2021లో ఆ స్థలాన్ని డీఆర్‌డీవో స్వాధీనం చేసుకుంది. ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం చుట్టూ ప్రహరీని నిర్మించింది. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరగలేదు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ప్రధాని మోడీయే వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ తర్వాత.. భారతదేశంలో రెండో ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రంగా గుల్లలమోద మారనుంది. షార్ట్-రేంజ్, లాంగ్-రేంజ్ క్షిపణుల పరీక్షలకు ఇది వేదిక కానుంది.