Minister Roja : ఎన్టీఆర్ ఎపిసోడ్ కు మంత్రి రోజా `బ్లూ ఫిల్మ్` ముడి..!

Minister Roja :  మంత్రి రోజా బ్లూ ఫిల్మ్ వ్య‌వ‌హారాన్ని కూడా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ప‌ద‌వీచ్చుడు అయిన ఎపిసోడ్ కు లింకు పెట్టారు.

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 01:34 PM IST

Minister Roja :  మంత్రి రోజా బ్లూ ఫిల్మ్ వ్య‌వ‌హారాన్ని కూడా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ప‌ద‌వీచ్చుడు అయిన ఎపిసోడ్ కు లింకు పెట్టారు. కొన్ని ద‌శాబ్దాలుగా చంద్ర‌బాబు మీద వెన్నుపోటుదారు అంటూ ప్ర‌త్య‌ర్థులు ముద్ర‌వేశారు. దాన్ని ప‌దేప‌దే చెబుతూ టీడీపీని దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇప్పుడు రోజా బ్లూ ఫిల్మ్ ఎపిసోడ్ ను కూడా 1995లో జ‌రిగిన రాజ్యాంగ‌బ‌ద్ధ మార్పున‌కు ముడిపెడుతున్నారంటూ టీడీపీ వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఎంత వివ‌ర‌ణ ఇచ్చిన‌ప్ప‌టికీ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ స్వ‌ర్గీయ వైఎస్ నుంచి ఇప్ప‌టి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ర‌కు చెబుతున్నారు. ఆ ఘ‌ట‌న‌పై ప‌లు కోణాల నుంచి సినిమాలు కూడా తీశారు. కానీ, ఇప్పుడు రోజా బ్లూ ఫిల్మ్ ఎపిసోడ్ కు లింకేయ‌డ‌మే ఎన్టీఆర్ అభిమానులు సైతం జీర్ణించుకోలేక‌పోతున్నారు.

రోజా బ్లూ ఫిల్మ్ వ్య‌వ‌హారాన్ని ఎన్టీఆర్ ప‌ద‌వీచ్చుడు ఎపిసోడ్ కు లింకు (Minister Roja )

బ్లూ ఫిల్మ్ లో రోజా న‌టించింద‌ని చాలా కాలంగా వినిపిస్తోన్న ఆరోప‌ణ‌. దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు మాజీ మంత్రి బండారు స‌త్యనారాయ‌ణ‌మూర్తి చేసిన కామెంట్స్ హాట్ గా మారాయి. మంత్రి రోజా ప్రైవేటు జీవితంలోకి ఆయ‌న వెళ్లారు. అంతేకాదు, 1998లో మిర్యాల‌గూడలోని ఒక రూమ్ లో ఎవ‌రితో ఉన్నావు? అంటూ మొద‌లు పెట్టి, బ్లూ ఫిల్మ్ ఆధారాల‌ను బ‌య‌ట‌పెడ‌తానంటూ వార్నింగ్ ఇచ్చారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. జైలుకు చంద్ర‌బాబునాయుడిని పంపిన త‌రువాత భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి క్యాండిల్ ర్యాలీ నిర‌స‌న తెలిపారు. ఆ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నైజాన్ని త‌ప్పుబ‌ట్టారు. దీంతో మీడియా ముందుకొచ్చిన రోజా భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణిల మీద అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావించారు. ప్ర‌తిగా బండారు మంత్రి రోజా (Minister Roja) ప్రైవేటు జీవితాన్ని బ‌జారుకీడ్చారు.

Also Read : Roja Blue Film Issue : మిర్యాల‌గూడ‌లో రోజా ఎవ‌రితో గ‌డిపారు? `బ్లూ ఫిల్మ్ ` నిజ‌మేనా?

వాస్త‌వంగా ఎన్టీఆర్ ప‌ద‌వీచ్యుడు కావ‌డం వెనుక జ‌రిగిన అంశాల‌ను ప‌లు విధాలుగా చెబుతుంటారు. తెలుగుదేశం పార్టీ మీద ల‌క్ష్మీపార్వ‌తి పెత్త‌నం పెరిగినందున జ‌రిగిన రాజ్యాంగ బ‌ద్ధ మార్పుగా కొంద‌రు అంటారు. ఆ రోజున జ‌రిగిన ఎపిసోడ్ ను స‌మ‌కాలీన రాజ‌కీయ ప‌రిణామాల‌కు అన్వ‌యిస్తే, రాజ్యాంగ బ‌ద్ధంగా క‌నిపిస్తోంది. ఎందుకంటే, సీఎంగా ఉండ‌గా వైఎస్ మ‌ర‌ణించారు. ఆ సంద‌ర్భంగా సీఎం పద‌వి కోసం తండ్రి శ‌వాన్ని ప‌క్క‌న పెట్టుకుని ఎమ్మెల్యేల‌తో సంత‌కాల సేక‌ర‌ణ‌కు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పూనుకున్నారు. కానీ, ఆయ‌న వ్యూహం ఫ‌లించ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

ఏపీ స‌మాజాన్ని జ‌గ‌న్మోహన్ రెడ్డి వెన్నుపోటు

అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత త‌ల్లి విజ‌య‌మ్మ‌ను ప‌క్క‌న పెట్టారు. సోద‌రి ష‌ర్మిల‌ను రాజ‌కీయ‌వేదిక‌పైన లేకుండా చేయ‌గ‌లిగారు. మ‌ద్య‌నిషేధం, ప్ర‌త్యేక హోదా, సీపీఎస్ ర‌ద్దు అంటూ హామీలు ఇవ్వ‌డం ద్వారా ఏపీ స‌మాజాన్ని జ‌గ‌న్మోహన్ రెడ్డి వెన్నుపోటుపొడిచారని టీడీపీ చెబుతోంది. అంతేకాదు, తెలుగుదేశం పార్టీకి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను ఆ పార్టీకి దూరం చేసి పొడిచిన నిలువుపోటు అంద‌రికీ తెలిసిందే. ఇక ఆయ‌నకు పెద్ద‌న్న‌గా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు వెన్నుపోటు పొడిస్తూ ఆ పార్టీల ఎమ్మెల్యేల‌ను లాగేసుకున్నారు. ప్ర‌త్యేక రాష్ట్రం ఇస్తే ద‌ళితుడ్ని సీఎం చేస్తాన‌ని పొడిచిన పోటును ఏమ‌నాలి? అనేది జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ టీమ్ కు (Minister Roja) తెలియాలి.

Also Read : RK Roja : మహానటి రోజా.. ఆ వీడియోలు ఒకసారి చూసి మాట్లాడు – వంగలపూడి అనిత

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఎపిసోడ్ ను ప‌రిశీలిస్తే నైతికంగా చంద్ర‌బాబు చేసిన ప‌ని నూటికినూరుపాళ్లు త‌ప్పే. కానీ, స‌మ‌కాలీన రాజ‌కీయాల ప్ర‌కారం రాజ్యాంగ బ‌ద్ధంగా జ‌రిగిన అధికార మార్పిడి కింద తీసుకోవాలి. కేంద్రంలోని బీజేపీ నుంచి రాష్ట్రాల్లోని ప్ర‌భుత్వాల వ‌ర‌కు చేస్తోన్న అనైతిక ఆప‌రేష‌న్ల‌ను గ‌మ‌నిస్తే ఏది రాజ్యాంగ బ‌ద్ధం? ఏది నైతిక‌త అనేది అర్థ‌మ‌వుతోంది. రాజ్య‌స‌భ వేదిక‌గా తెలుగుదేశం పార్టీని బీజేపీ విలీనం చేసుకుంది. ఇక అసెంబ్లీ వేదిక‌గా కాంగ్రెస్, తెల‌గుదేశం పార్టీని టీఆర్ఎస్ విలీనం చేసుకుంది. ఇలాంటి వాటిని వెన్నుపోటు అన‌లేమా? కేవ‌లం స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుడ్ని చేయ‌డాన్ని వెన్నుపోటు అంటూ ఎన్ని ద‌శాబ్దాలు అంటారు? అనేది ఆలోచించాలి. మంత్రి రోజా బ్లూ ఫిల్మ్ ఎపిసోడ్ కు (Minister Roja)  ఎన్టీఆర్ ను ప‌ద‌వీచ్యుడ్ని చేయ‌డాన్ని ముడిపెట్ట‌డం ఏ రాజ‌కీయం కింది తీసుకోవాలి? అనేది రోజా చెప్పాలి.