Minister RK Roja : పబ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేసిన మంత్రి రోజా ..

వైసీపీ మంత్రి రోజా (Minister RK Roja) న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrtions) ఫుల్ గా ఎంజాయ్ చేసింది. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకాయి. సినీ , రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం 2023 కి బై..బై చెపుతూ..2024 కి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. అయితే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులోని ఒక పబ్బు(PUB)లో ఫుల్ […]

Published By: HashtagU Telugu Desk
Roja Pub

Roja Pub

వైసీపీ మంత్రి రోజా (Minister RK Roja) న్యూ ఇయర్ వేడుకలను (New Year Celebrtions) ఫుల్ గా ఎంజాయ్ చేసింది. దేశ వ్యాప్తంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్ని తాకాయి. సినీ , రాజకీయ నేతలతో పాటు సామాన్య ప్రజలు సైతం 2023 కి బై..బై చెపుతూ..2024 కి గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. అయితే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరులోని ఒక పబ్బు(PUB)లో ఫుల్ గా ఎంజాయ్ చేసింది. దానికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ వీడియో పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పబ్బులో చిందులేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మంత్రిగా ఉన్న భూమా అఖిల ప్రియా నంద్యాల ఉప ఎన్నికల్లో పంజాబీ డ్రెస్ వేసుకొని ప్రచారం చేయడంపై రోజా తీవ్రస్థాయిలో కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే మంత్రి పదవిలో ఉన్న రోజా ఇలా డ్రస్సులు వేసుకుని పబ్ లో డ్యాన్స్ లు చేయడం సబబేనా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రోజా తీరును ప్రతి పక్ష పార్టీలు బాగా వాడుకోవడం మొదలుపెట్టాయి. మరి దీనిపై రోజా ఏమైనా రియాక్ట్ అవుతుందా..లేదా అనేది చూడాలి.

Read Also : CM Revanth : మహిళలకు మరో గుడ్ న్యూస్ తెలిపేందుకు సిద్దమైన సీఎం రేవంత్

  Last Updated: 02 Jan 2024, 11:21 AM IST