ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ – నారా లోకేష్ (Pawan – Lokesh) లు నిత్యం సోదర భావంతో ఉంటారు. తన కుటుంబంతో పాటు టీడీపీ పార్టీ కష్ట కాలంలో ఉండగా నేనున్నాను అంటూ ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్. అక్రమంగా చంద్రబాబు ను జైల్లో పెడితే రోడ్ పై పడుకొని ధర్నా చేసి..తెలుగు తమ్ముళ్ల హృదయాల్లో అన్నయ్య అయ్యారు. అంతే కాదు జైలు కు వెళ్లి చంద్రబాబు ను పరామర్శించి..మద్దతు పలికి కూటమికి విజయానికి బాసట అయ్యారు.
అందుకే లోకేష్ పవన్ కళ్యాణ్ విషయంలో కృతజ్ఞతా భావంతోనే మెలుగుతారు. ఇది పలు ఆసందర్భాల్లో చూశాం కూడా. ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేశారు లోకేష్, వద్దని వారించినా ఆయన వినలేదు. పవన్ కాలిని తాకి ఆశీర్వచనం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన వైరల్ గా మారింది. విమర్శకుల నోరును సైతం మూయించింది. తాజాగా అటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
Pak spy : పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్ అరెస్టు..
రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై (Yuvagalam Padayatra) రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు (Deputy CM Pawan Kalyan) మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) అందజేశారు. బుధవారం ఉదయం సచివాయంలో కేబినెట్ సమావేశం సందర్భంగా జరిగింది. పుస్తకం అందించిన అనంతరం పవన్ కళ్యాణ్ లోకేష్‌ను అభినందించడమే కాకుండా, యువగళం పాదయాత్రను ప్రజలను చైతన్యపరచిన శక్తివంతమైన ప్రయాణంగా పేర్కొన్నారు. లోకేష్ విజ్ఞతతో పాదయాత్రను పుస్తక రూపంలో తేవడం ఎంతో అభినందనీయమని అన్నారు.
Nara Lokesh : అభివృద్ధి, ప్రజాస్వామ్యం విజయానికి ప్రతీకగా కూటమి పాలనకి ఏడాది
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య హృద్యమైన సంభాషణలు జరిగాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జగన్ హయాంలో ప్రజలపై జరిగిన అరాచకాలను ఇప్పటికీ జనం మరిచిపోలేకపోతున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో ఎదురైన అనుభవాలను పుస్తకంగా తీసుకురావడం ఎంతో గొప్ప విషయం అని చెప్పారు. పుస్తకం ద్వారా ఆ పాదయాత్ర గాథను కొత్త తరం తెలుసుకునేలా చేయడంలో లోకేష్ తీసుకున్న ఈ ప్రయత్నం రాజకీయాల్లో కొత్త దిశగా భావించవచ్చు.
రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తక ప్రతిని రాష్ట్ర సచివాలయంలో యువనేత నారా లోకేష్ గారు… డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… నాటి రాక్షస పాలనపై ప్రజలను చైతన్యవంతం చేయడంలో యువగళం పాదయాత్ర… pic.twitter.com/7Icta6uIUl
— Telugu Desam Party (@JaiTDP) June 4, 2025