Site icon HashtagU Telugu

Nara Lokesh : నారా లోకేష్ మాట ఇచ్చాడంటే తిరుగుండదు

Lokesh Fulfilled His Promis

Lokesh Fulfilled His Promis

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఒకసారి మాట ఇచ్చాడంటే ఇక తిరుగుండదని మరోసారి నిరూపించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఉన్న శ్రీ కాశినాయన అన్నదాన సత్రం (Sri Kasinayana Annadana Satram) కూల్చివేతపై లోకేష్ వెంటనే స్పందించారు. అటవీ శాఖ అధికారులు (Forest Department officials)చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పడంతో పాటు, తానే స్వయంగా తన సొంత నిధులతో ఆశ్రమ భవనాలను తిరిగి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయం వెలుగులోకి రాగానే ఆయన కార్యాచరణ మొదలైపోయింది. మాట ఇచ్చిన రోజునే నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారు.

Assembly : తప్పు చేయాలంటేనే భయపడేలా కఠిన చర్యలు : మంత్రి లోకేశ్‌

బుధవారం రాత్రికే తన ప్రత్యేక బృందాన్ని బద్వేలు పంపిన లోకేష్, గురువారం ఉదయానికే పునర్నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. ముందుగా భవనాల నిర్మాణానికి అవసరమైన స్థల పరిశీలన, మార్కింగ్ పనులు జరిగాయి. మధ్యాహ్నానికి మట్టి తవ్వకాలు మొదలవుతాయని, త్వరితగతిన నిర్మాణం పూర్తవుతుందని సమాచారం. లోకేష్ వ్యవహారశైలి చూస్తుంటే, ఆయన మాట ఇచ్చినపుడు ఇక వెనుదిరుగే ప్రశ్నే ఉండదని మరోసారి ప్రజలకు స్పష్టమైంది.

YCP : వైసీపీ వారికీ చుక్కలు చూపిస్తున్న కూటమి సర్కార్

తన నిర్ణయాలను వెంటనే అమలు చేయడంలో లోకేష్ తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందించే తీరు, నిర్ణయాలను కార్యరూపం దాల్చే విధానం టీడీపీ శ్రేణులకు ఉత్సాహం కలిగిస్తోంది. కాశినాయన సత్రం వ్యవహారంలో ఆయన చూపిన వేగం, పట్టుదల, బాధ్యతాయుతమైన నిర్ణయాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. పునర్నిర్మాణ పనులు పూర్తయి సత్రం మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందేలా లోకేష్ తీసుకుంటున్న చర్యలు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయి.