Site icon HashtagU Telugu

Kasireddy Vs Liquor Scam: సిట్ ఎదుటకు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి .. ఏపీ లిక్కర్ స్కాంలో పాత్రేమిటి ?

Ap Liquor Scam Kasireddy Rajasekhar Reddy Sit Notice Ys Jagan

Kasireddy Vs Liquor Scam:  కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి(రాజ్‌ కసిరెడ్డి).. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైఎస్ జగన్ దూరపు బంధువు. వైఎస్సార్ సీపీ హయాంలో ఏపీలో జరిగిన రూ.వేల కోట్ల లిక్కర్ స్కాంకు సంబంధించిన అభియోగాలను ఎదుర్కొంటున్న ఈయనకు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు టీం (సిట్) మూడుసార్లు నోటీసులు ఇచ్చింది. సిట్‌కు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ బాబు నేతృత్వం వహిస్తున్నారు. ఇటీవలే మూడోసారి కసిరెడ్డికి నోటీసులు జారీ చేసిన సిట్.. ఏప్రిల్ 9న (బుధవారం) తప్పకుండా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అంతకుముందు సిట్ జారీ చేసిన రెండు నోటీసులపై కసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. దీంతో ఈసారి ఆయన తప్పనిసరిగా సిట్ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇవాళ కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సిట్ ఎదుటకు వస్తారా ? రారా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read :MBiPC Benefits : ఇంటర్‌లో ఇక ఎంబైపీసీ గ్రూపు.. కొత్త మార్పులు, మార్కుల వివరాలివీ

కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి‌పై అభియోగాలు ఏమిటి ? 

లంచాల సేకరణకు పెద్ద నెట్‌వర్క్ 

మద్యం సరఫరా ఆర్డర్లను పొందే కంపెనీలు చెల్లించే లంచాల వసూళ్ల కోసం క్యాష్‌ హ్యాండ్లర్లు(Kasireddy Vs Liquor Scam), క్యాష్‌ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థను స్వయంగా రాజ్‌ కసిరెడ్డే పర్యవేక్షించే వారట. లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించేదట. మద్యం కంపెనీ ప్రతినిధుల నుంచి లంచం డబ్బులు క్యాష్‌ హ్యాండ్లర్లకు, వారి నుంచి రాజ్‌ కసిరెడ్డి నియమించిన కొరియర్లకు అందేవి.  క్యాష్‌ కొరియర్లు తీసుకున్న డబ్బు ఒక వ్యక్తికి అందేది. అతడి నుంచి డబ్బంతా  నేరుగా రాజ్‌ కసిరెడ్డికి అందేది.  రాజ్‌ కసిరెడ్డి నుంచి ఈ డబ్బు ఒక వైఎస్సార్ సీపీ టాప్ లీడర్ కుమారుడికి అందేది.  అతడి నుంచి అది చివరగా చేరాల్సిన చోటుకు చేరేదట.

Also Read :New Aadhaar App: సరికొత్త ఆధార్ యాప్.. ఇక ఆ పనులన్నీ ఈజీ