Kasireddy Rajasekhar Reddy : లిక్కర్ స్కాంలో సిట్ అధికారుల నోటీసులపై వివరణ ఇస్తూ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి ఒక ఆడియో సందేశాన్ని పంపారు. పరారీలో ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ విడుదల చేసిన ఆడియో సంచలనంగా మారింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణల పట్ల ఆయన ఈ ఆడియో క్లిప్పింగ్ ద్వారా బదులిచ్చారు. ఏపీ లిక్కర్ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ వరుస నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, రాజ్ కసిరెడ్డి అజ్ఞాతం నుంచి ఆడియో సందేశం పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Also: Harish Rao : కార్మికుల సమ్మెకు బీఆర్ఎస్ మద్దతు: హరీశ్ రావు
నేను లేనప్పుడు సిట్ అధికారులు మార్చిలో మా ఇంటికి వచ్చారు. మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. నన్ను విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. ఎందుకు పిలుస్తున్నారో క్లూ ఇవ్వమని అడిగా. నా ఈ మెయిల్‌కు సెకండ్ నోటీసు ఇచ్చారు. నేను నా లాయర్లను సంప్రదించా. ముందస్తు బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశా. సిట్ విచారణకు నేను పూర్తిగా సహకరిస్తా. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నా అని కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఒకవైపు వాదనలు విని మీడియాలో వార్తలు ప్రసారం చేయొద్దని, తన వాదన కూడా వినాలని, త్వరలోనే మీడియా ముందుకు వచ్చి విజయసాయి వ్యవహారంతో సహా అన్ని విషయాలు చెబుతానని వెల్లడించారు.
మద్యం కుంభకోణంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నాపై విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణల్లో నిజం లేదు. న్యాయపోరాటం ముగిశాక మీడియాను పిలిచి విజయసాయిరెడ్డి చరిత్ర మొత్తం చెబుతా అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డి… విజయసాయిని ‘బట్టేబాజ్ మనిషి’ అని పేర్కొన్నారు. సిట్ నోటీసులకు తాను స్పందించానని రాజ్ కసిరెడ్డి వెల్లడించారు. నోటీసులపై తన న్యాయవాదులను సంప్రదించగా, సిట్ మిమ్మల్ని సాక్షిగా పేర్కొంటోందని, అయితే అరెస్ట్ చేసే అవకాశముందని వారు చెప్పారని వివరించారు.
Read Also:8th Pay Commission: ఉద్యోగులకు కేంద్రం మరో భారీ శుభవార్త.. భారీగా పెరగనున్న జీతాలు!