Site icon HashtagU Telugu

Huge Land Scam : ఇబ్రహీంపట్నంలో భారీ భూ కుంభకోణం..భారతి బినామీఫై ఆరోపణలు..?

Huge Land Scam In Ibrahimpa

Huge Land Scam In Ibrahimpa

గత వైసీపీ (YCP) హయాంలో ఏపీలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు జరిగిన సంగతి తెలిసిందే. అధికారం చేతులో ఉందని చెప్పి వైసీపీ నేతలే కాదు వారికీ కావాల్సిన వారు సైతం ప్రభుత్వ అండ చూసుకొని పెద్ద ఎత్తున భూ కుంభకోణాలు చేసారు. ప్రధాన నగరాల్లో పెద్ద ఎత్తున భూమిని కబ్జాలు చేసుకొని వారి బినామీల పేర్లతో రిజిస్టేషన్ చేయించుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి కోల్పోయిన వారు , భూ కుంభకోణాలు జరిగిన తీరుపై విచారణ జరిపి న్యాయం చేయాలనీ కోరుతూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam)లో జరిగిన భారీ భూ కుంభకోణం (Huge Land Scam ) వెలుగులోకి వచ్చింది.

Brahmani : బాలయ్య కూతురు బ్రాహ్మణికి హీరోయిన్ ఆఫర్ ఇచ్చిన మణిరత్నం.. కానీ..

ఇబ్రహీంపట్నం కేంద్రంగా రూ.700 కోట్ల విలువైన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ స్కామ్ గురించి రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ఒక లేఖ రాసి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు వివరించారు. ఈ లేఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ (Jagan) సోదరుడు వైఎస్ సునిల్, ఆయన PA నాగేశ్వర్ రెడ్డి, సినీ నటి రీతూ చౌదరి (Rithu Chowdary), చీమకుర్తి శ్రీకాంత్ లకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి.

రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ ప్రకారం..

నేను 1992 నుండి, 2023 వరకు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి చివరిగా 2023 వరకు ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ గా పనిచేసాను. నేను జూన్ 2024 న రిటైర్ అయ్యాను. నేను, మా తండ్రి గారు అయిన మధు సూధన సింగ్ హిందూ ధర్మ వాదులు, భక్తి పరులు అయినందున కొల్లూరు మండలం- బాపట్ల జిల్లా, కొల్లూరు గ్రామము లో శిధిలావస్థలో ఉన్న భవాని మాత ఆలయం మరియు శివాలయం అంజనేయ స్వామి ఆలయాలను 201.1 నుండి 2022 మధ్య కాలములో దాతల సహకారముతో పునర్నిర్మాణం చేసినాము. 2015 సం. లో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత, బిగన్ మోహన్ రెడ్డి వినామీలుగా చెప్పుకోబడిన వై.స్ సునీల్ రెడ్డి మరియు జగన్ మోహన్ రెడ్డి P.A గా పనిచేస్తున్న K.N.R, దీమకుర్తి శ్రీకాంత్ అను వద్దకు పంపి, విశాఖ పట్నం, విజయవాడ, రాజమండ్రి లో గల వందల కోట్ల విలువగల భూములను, చీమకుర్తి శ్రీకాంత్, అతని రెండవ భార్య అయిన TV నటి వసం దివ్య (రీతూ చౌదరి) అతని కుటుంబ సభ్యుల పేరుమీద రిజిస్టర్ చేయాలనీ ఒత్తిడి తీసుకొని వొచ్చారు. ఎన్నో సార్లు ఈ పని నేను చేయలేను అని. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి అని, వారికీ విన్నవించుకొన్నాను. వారు చెప్పిన రిజిస్ట్రేషన్స్ చెయ్యకపోతే నాపై ఏ.సీ.బీ రైడ్ చేయిస్తాము అని, నీ కుటుంబ సభ్యులను వేధించి, డాక్టర్ సుధాకర్ లాగా ఆత్మహత్య చేసుకొనేలా చేస్తాము అని, చంద్రబాబు నాయుడి అంతటి వారినే తప్పుడు ఏసీబీ కేసులో ఇరికించాము, నిన్ను నీకుటుంబాన్ని ఇరికించి నీవు కట్టించిన దేవాలయాలు ఆక్రమ ఆస్తులు గా చూపించి జైలుకు పంపుతాము అని బెదిరించి, నా చేత కొన్ని వందల కోట్ల విలువల భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బెదిరింపులలో నా పై అధికారి అయిన ఆడిట్ రిజిస్టర్ కే.రామారావు కూడా బాగస్వామ్యుడయి ఉన్నాడు. ఈ దీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తి స్వయానా భారతి రెడ్డి గారి బినామీ అయినందున, కొన్ని వేల కోట్ల రూపాయల భూములు తప్పుడు రిజిస్ట్రేషన్స్ చేయించుకున్నాడు.

Rajagopala Chidambaram: అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇకలేరు.. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర

ఈ భూములకు సంబందించిన అన్ని ఆధారాలు నా వద్ద కలవు. అంతే కాకుండా నా మీద ఏ. సీ. బీ రైడ్ చేయిస్తాం అని బెదిరించి. నా కష్టాల్లైతము అయిన ఇంటిని తాకట్టు పెట్టింది నా పద్దనుండి 30. లక్షల రూపాయలు వసూలు చేసారు. చివరకు ఇంకా భూములు రిజిస్టర్ చెయ్యాలని ఒత్తిడి పెరగడం తో నేను ఇంక తప్పుడు రిజిస్ట్రేషన్లు చెయ్యలేను అని చెప్పగా, నవంబర్ 17, 2023 న, నేను ఇంట్లో లేని సమయములో, ఏకధాటిగా నా కూతుర్లు, అల్లుళ్లు, బంధువులు, స్నేహితుల ఇళ్లపైకి ఏసీబీ అధికారులును పంపి, వారి కష్టార్జితాన్ని నా ఆస్తులుగా చెప్పి ఒప్పుకోవాలని బెదిరిస్తూ. నా పై విజయవాడ ఏసీబీ వారు FIR: 05/RAC/CIU/ACB-2021 నమోదు చేసారు. అంతే కాకుండా కొల్లూరు లో ప్రజా విరాళాలతో నిర్మించిన దేవాలయాల మీద కూడా దాడి చేసి, దేవాలయాన్ని కూడా అక్రమ ఆస్తులుగా చూపించి వాటికీ సంబందించిన అన్ని పత్రాలు తీసుకొని వెళ్లారు. అంతే కాకుండాటి మకుర్తి శ్రీకాంత్ అను వ్యక్తి, ఏసీబీ వారినుండి నన్ను కాపాడతాను అని. లేని సమయములో మా కుటుంబ సభ్యులను నమ్మించి అక్షరాలా కోటి రూపాయలు వసూలు చేసాడు. వారు డబ్బు అప్ప- చేసి మరీ ఇచ్చారు. నన్ను గోవాలో నిర్బంధించి, హింసించి, రావాల్సిన డబ్బు కోటి రూపాయలు’ నా కుటుంబ సభ్యుల నుండి వసూలు చేసి వొదిలివేసాడు. నేను హార్ట్ పేషేంట్ అయినందున అనారోగ్యం రీత్యా ఇంతకాలం బయటికి రాలేక పోయాను. ఇప్పటికి నాకు వై.సీ.పీ బినామీ అయిన చీమకుర్తి శ్రీకాంత్ నుండి ప్రాణ హాని ఉంది. దయగల మీరు ఈ విహాయము పై విచారణ జరిపి, ఏసీబీ అధికారుల ఒత్తిడి నుండి రక్షించి మరియు చీమకుర్తి శ్రీకాంత్ పై తగు చర్యలు తీసుకోగలరు అని వేడుకుంటున్నాను” అంటూ లేఖ రాసారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Ipmscam3

Ipmscam1

Ipmscam2