Site icon HashtagU Telugu

YCP MLA Leaked Video : బయటపడ్డ వైసీపీ ఎమ్మెల్యే రాసలీలలు..

Ycp Mla Video

Ycp Mla Video

ఏపీలో అధికార పార్టీ నేతల రాసలీలలు నిత్యం వెలుగులోకి వస్తూనే ఉంటాయి. కొంతమంది ఫోన్లలో మాట్లాడిన సంభాషణలు వెలుగులోకి రాగా..మరికొంతమంది వీడియోలు బయటకు వచ్చాయి. వీటిపై ప్రతిపక్ష పార్టీల నేతలు, రాష్ట్ర మహిళలు , నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకపడినప్పటికీ వీరు తీరు మాత్రం మారడం లేదు. వారి పని వారిది..మా పని మాది అన్నట్లు రొమాన్స్ లో రెచ్చిపోతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే రాసలీలలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జే.సుధాకర్ బాబు (Kodumuru MLA Dr. J Sudhakar Babu) కు సంబదించిన రాసలీలల వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో లో ఆయన ఓ యువతితో రాసలీలలు జరుపుతూ కనిపించారు. యువతిని బలవంతంగా కౌగిలించుకొని అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. కర్నూలు (Kurnool) జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. కెమెరా ముందు మహిళల సంరక్షణ గురించి ఉపన్యాసాలు ఇచ్చే ఈ నేతలు.. తెరవెనుక మాత్రం ఇలాంటి పాడుపనులు చేయడం చూసి ఛీ ఇలాంటి వారికా..మనం ఓటు వేసేది అంటూ తిడుతున్నారు.

Read Also : Jagan : విదేశాలకు వెళ్లేందుకు జగన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన CBI