Jagan Attack Case : జగన్ ఇలాఖాలో `కోడి కత్తి` డ్రామా

ఏపీ రాజకీయ చరిత్రలో కోడి కత్తి కేసు ఒక సంచలనం. ఆ కేసులోని నిజా నిజాలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు.

  • Written By:
  • Updated On - October 26, 2022 / 04:44 PM IST

ఏపీ రాజకీయ చరిత్రలో కోడి కత్తి కేసు ఒక సంచలనం. ఆ కేసులోని నిజా నిజాలు ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం కోడి కత్తి శ్రీనుకు వైసీపీ అండ ఉందని తరచూ న్యూస్ ఏదో ఒక రూపంలో వస్తుంది. ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఛార్జ్ తీసుకున్న తరువాత స్వర్గీయ వైస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ మరణంపై సీబీ ఐ విచారణ అవసరం లేదని జగన్ తేల్చేశారు. ఇక సంచలనం కలిగించిన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తేలలేదు. దానిపై జగన్ పెద్దగా సీరియస్ గా స్పందించడం లేదు . ఆయన చెల్లెలు షర్మిల మాత్రం ఎంపీ సీట్ కోసం హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనుకు బెయిల్ ఇప్పించే దిశగా జగన్ నిర్ణయం తీసుకుంటారని టాక్ ఉంది.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి సంచలనం రేపింది. దాడి తర్వాత ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ హైదరాబాద్ లో చికిత్స తీసుకున్న వైఎస్ జగన్ ఆ తర్వాత ఆ విషయం పట్టించుకోలేదు. కానీ ఈ దాడికి పాల్పడిన కోడి కత్తి శ్రీను మాత్రం రోడ్డున పడ్డాడు. అతన్ని ఎన్ఐఏ అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ కేసులో బెయిల్ కూడా లభించక అతను జైల్లోనే మగ్గుతున్నాడు.

Also Read:   Chandrababu: చంద్రబాబు `మహా` పోరు

ఈ నేపథ్యంలో కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులు బెయిల్ ఇప్పించేందుకు జగన్ సహకారం కోసం సీఎం ఆఫీస్ ను సంప్రదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోడి కత్తి శ్రీను బెయిల్ కు అభ్యంతరం లేదని ఎన్ఓసీ ఇస్తే చాలని అడుగుతున్నారు. ఈ మేరకు సీఎం జగన్ ను నేరుగా కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కోడి కత్తి శ్రీను కుటుంబ సభ్యులు సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. తల్లితో పాటు తమ్ముడు, లాయర్ కూడా సీఎం క్యాంప్ కార్యాలయం వద్దకు కనిపించారు.

సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఫిర్యాదుల విభాగం వద్ద తమ కుమారుడు బెయిల్ కోసం సీఎం వైఎస్ జగన్ ను ఎన్ఓసీ ఇమ్మని కోరుతున్నారు. వైఎస్ జగన్ పై ఎయిర్ పోర్టులో దాడి కేసులో నాలుగేళ్లుగా శ్రీను జైల్లోనే ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా బెయిల్ కు సహకరించాలని జగన్ ను కోరబోతున్నారు. ఈ కీలక విషయంలో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. జగన్ తనపై దాడి చేసిన నిందితుడి విషయంలో ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Also Read:   TDP vs YSRCP : వైసీపీ రాజకీయ లబ్ది కోసమే మూడు రాజధానులు – మాజీ మంత్రి య‌న‌మ‌ల‌