Site icon HashtagU Telugu

Kiran Royal Audio Leak: పవన్ కళ్యాణ్ కు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్

Kiranroyalaudio

Kiranroyalaudio

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)కు తిరుపతి జనసేన పార్టీ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ (Kiran Royal) వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనపై లక్ష్మీ అనే మహిళ చేసిన ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, తనతో అక్రమ సంబంధం కొనసాగించారని లక్ష్మీ మీడియా ముందు ఆరోపిస్తూ వస్తోంది. ఈ వ్యవహారం జనసేనకు రాజకీయంగా దెబ్బతీసేలా మారింది.

Telangana Bill : ‘ప్రత్యేక తెలంగాణ’ బిల్లుకు 11 ఏళ్లు

ఈ వ్యవహారం కొనసాగుతున్న వేళ కిరణ్ రాయల్‌కు సంబంధించిన ఆడియో టేపులు బయటకు వస్తున్నాయి. ఈ టేపుల్లో ఆయన చెప్పిన మాటలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. “నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. ఏడు నెలల్లోనే ఐదుగురితో తిరిగా. నాకు రోజుకొక అమ్మాయి కావాల్సిందే” అంటూ ఓ ఆడియోలో చెప్పిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన శ్రేణులు అయోమయం అవుతున్నారు.

BJP : ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారానికి పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు !

 

ఈ వ్యవహారాన్ని ఆసరాగా చేసుకొని వైఎస్సార్సీపీ (YCP) జనసేనపై దుమ్మెత్తిపోస్తోంది. పవిత్రమైన తిరుపతిలో ఇలాంటి వ్యక్తిని ఇన్‌చార్జ్‌గా ఎందుకు నియమించావు? అని పవన్ కళ్యాణ్‌ను నిలదీస్తున్నారు. జనసేన పార్టీ మహిళా సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ, పవన్ కళ్యాణ్ మహిళా భద్రతపై చేసే ప్రసంగాలను ఉటంకిస్తూ వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనతో పవన్ కళ్యాణ్‌కు మానసిక ఒత్తిడి పెరిగిందని అంటున్నారు విశ్లేషకులు. జనసేన వర్గాలు మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. కిరణ్ రాయల్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చారా? లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. కానీ వైసీపీ ఈ వ్యవహారాన్ని మరింతగా రాజకీయం చేస్తూ జనసేనపై విమర్శలు గుప్పిస్తోంది. జనసేన నాయకత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.