KA Paul : భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ సంచలన కామెంట్స్ చేశారు. ‘‘నేను రాత్రి పగలు అనే తేడా లేకుండా భారత్, పాకిస్తాన్ మధ్య చర్చలు జరుపుతున్నాను. ఈక్రమంలో ఇటీవలే రహస్యంగా మూడు రోజుల పాటు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులను కలిశాను. యుద్దాన్ని ఆపే శక్తి నాకే ఉందని వారు చెప్పారు. మే 10న ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన తర్వాత ఆదివారం పాకిస్తాన్‌కు వెళ్తాను. నేను భారత్ – పాక్ యుద్ధాన్ని ఆపే ప్రయత్నంలో ఉన్నాను. ప్రధాని మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నటైంలో 2002లో నేను పాకిస్తాన్‌కు వెళ్లాను. భారత్ కేవలం టెర్రరిస్టులను మాత్రమే టార్గెట్ చేస్తోంది’’ అని కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Operation Sindoor Inside : ‘ఆపరేషన్ సిందూర్’ కోసం భారత్ ఇలా ప్లాన్ చేసింది..
జగన్, పవన్, చంద్రబాబు, లోకేశ్‌లపై కీలక వ్యాఖ్యలు
‘‘ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసలు క్రిస్టియన్ కాదు. జగన్ చినజీయర్ స్వామి భక్తుడు. నా ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే గత ఎన్నికల్లో జగన్ చిత్తుగా ఓడిపోయాడు. పాస్టర్ ప్రవీణ్‌ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేయమని నేను హైకోర్టును ఆశ్రయిస్తే రూ. 5 లక్షలు డిపాజిట్ చేయమని జడ్జి చెప్పారు’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు. “కేఏ పాల్‌కు అధికారం వస్తేనే పాలన మారుతుంది” అని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను’’ కేఏ పాల్ తేల్చి చెప్పారు. ‘‘ఎన్నికల ముందు 30 వేల మంది అదృశ్యమైన అమ్మాయిల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఒకప్పుడు మోడీని విమర్శించి ఇప్పుడు ఆయనే గొప్ప ప్రధాని అంటున్నారు’’ అని ఆయన ఎద్దేవా చేశారు. ‘‘గతంలో చంద్రబాబు సైతం మోడీని దుమ్మెత్తిపోసి, ఇప్పుడు విశ్వగురు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు’’ అని కేఏ పాల్ విమర్శించారు. ‘‘లోకేశ్ అయితే మోడీని వంద మిస్సైళ్లతో పోల్చారు.కానీ ఆ మిస్సైల్ హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య చిచ్చుపెట్టే.. ‘పడిపోయే మిస్సైల్’’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.