HCL Tech Jobs: ఇంటర్ పాసైతే చాలు. ఏటా లక్షల ప్యాకేజీతో ఐటీ జాబ్. ఔను.. ఈ ఆఫర్‌ను దిగ్గజ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ అందిస్తోంది. ఈ వివరాలను మనం కథనంలో తెలుసుకుందాం..
Also Read :Pawan Kalyans Son: పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు.. సింగపూర్‌లో అగ్ని ప్రమాదం
రూ.2.20 లక్షల వార్షిక వేతనం
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో “సూపర్ ఛార్జ్ యువర్ కెరియర్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్” అనే పేరుతో ప్రత్యేక పథకాన్ని హెచ్‌సీఎల్ టెక్(HCL Tech Jobs) అమలు చేస్తోంది. దీనిలో చేరితే హెచ్‌సీఎల్ టెక్‌లో ఉద్యోగంతో పాటు ఆన్‌లైన్‌లో చదువుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. జాబ్‌కు అర్హత సాధించాక సంవత్సరానికి రూ.1.96 లక్షల నుంచి రూ.2.20 లక్షల దాకా వార్షిక వేతన ప్యాకేజీని ఇస్తారు. ఇంటర్ పాసైన విద్యార్థులు https://registrations.hcltechbee.com/ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్, ఏ రాష్ట్రం , జిల్లా, డేట్ అఫ్ బర్త్, ఏ బోర్డులో ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ పూర్తి చేశారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది వంటి వివరాలన్నీ నింపాలి.
Also Read :Brain Vs Politics : రాజకీయ ఆలోచనలకు బ్రెయిన్‌తో లింక్.. ఆసక్తికర వివరాలు
ఇతర అర్హతలు ఇవీ..
- ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ 2023 లేక 2024లో పాసై ఉండాలి.
- తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో 75 శాతం మార్కులతో పాస్ కావాలి.
- CBSC బోర్డు ప్రకారం 70 శాతం మార్కులతో పాస్ కావాలి.
- ఐటీ రోల్, నాన్ ఐటీ ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు ఉంటాయి.
- సందేహాలు ఉన్న విద్యార్థులు కమాండ్ కంట్రోల్ నెంబర్స్ 998885335, 8712655686, 8790118349లకు కాల్ చేయొచ్చు.
- ఈ అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవచ్చు. తద్వారా వారికి బంగారు భవిత సొంతం అవుతుంది. హెచ్‌సీఎల్ అనేది మన దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ.